పీకే రాకను స్వాగతిస్తాం

పీకే రాకను స్వాగతిస్తాం
  • కమీషన్ల కోసం కట్టిన ప్రాజెక్టుల భారం ప్రజలపై మోపుతున్నారు
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల: ప్రశాంత్ కిశోర్ (పీకే) వ్యూహకర్త కాదు.. కాంగ్రెస్ కార్యకర్తేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన రాకను స్వాగతిస్తామని చెప్పారు. స్థానిక ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పన్నుల భారంతో  కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయన్నారు. ఏడేళ్లలో ఏడు లక్షల కోట్ల కోట్ల భారం ప్రజలపై మోపారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు దోపిడీ దొంగల్లా ఉందన్నారు.  
కమీషన్ల కోసం కట్టిన ప్రాజెక్టుల భారం ప్రజలపై మోపుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ కు ప్రజాస్వామ్యం పై విశ్వాసం ఉందా? రాజ్యాంగ బద్ధమైన పదవిని తూలనాడే విధంగా మంత్రి పదవిని ఎడమకాలి చెప్పుతో పోల్చుతూ  పదాలు వాడడం సిగ్గు చేటు అన్నారు. అలాంటి పదవిలో ఎవరు కొనసాగమన్నారు? అహకారంతో మాట్లాడిన మాటలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. 

 

ఇవి కూడా చదవండి

నిధుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలపై చర్చకు సిద్ధం

ప్రేమోన్మాది దాడి ఘటనపై స్పందించిన గవర్నర్

ఒక్క నిమిషం లేటైతే అనుమతించరు.. మరీ మీరు కావొచ్చా..?