ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. క్షేత్ర పురవిధుల్లో శ్రీస్వామి అమ్మవారి రధోత్సవం కన్నుల పండుగగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీస్వామి అమ్మవారికి రధోత్సవం శోభాయమానంగా జరుగింది. రథోత్సవంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆది దంపతులు . రథోత్సవానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. శివనామస్మరణతో మారుమోగాయి శ్రీగిరులు.
ఫిబ్రవరి 8 నుంచి జరుగుతోన్న ఈ బ్రహ్మోత్సవాల్లో ఫిబ్రవరి 17న యాగ పూర్ణాహుతి, ధ్వజారోహణ, 18న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఆర్జిత సేవలు నిలిపివేత..
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల18 వరకు అన్ని ఆర్జిత సేవలను నిలిపివేశారు. భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు స్పర్శ దర్శనాలను పూర్తిగా నిలిపి వేశారు.
