అది గుడివాడ.. అక్కడ కొడాలి నాని ఉన్నాడు

అది గుడివాడ.. అక్కడ కొడాలి నాని ఉన్నాడు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు శవాలతో రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. నిన్న ఒక వ్యక్తి గుండెపోటుతో మరణిస్తే.. అతను ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి మరణించాడని చంద్రబాబు అంటున్నారని నాని అన్నారు. నిజానికి ఆ వ్యక్తి గుండెపోటుతోనే మరణించారని, ఆయన ఉల్లిపాయల కోసం మార్కెట్‌కు వెళ్లలేదని, కూరగాయల కోసం వెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు మీడియా సాక్షిగా స్పష్టం చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏది పడితే అది చేయోచ్చని అనుకుంటున్నారని ఆయన అన్నారు. ‘అది గుడివాడ.. గుడివాడలో కొడాలి నాని ఉన్నాడు’అని ఆ విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తుంచుకోవాలని నాని హెచ్చరించాడు.