అండర్‌‌-19 వరల్డ్‌‌కప్‌‌ను మర్చిపోలేం: కోహ్లీ

అండర్‌‌-19 వరల్డ్‌‌కప్‌‌ను మర్చిపోలేం: కోహ్లీ
  • విలియమ్సన్‌‌ సూపర్‌‌ ప్లేయర్‌‌

ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో తమ కెరీర్లను బలంగా నిర్మించుకోవడానికి 2008 అండర్‌‌–19 వరల్డ్‌‌ కప్‌‌ చాలా ఉపయోగపడిందని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ అన్నాడు. ఆ టోర్నీ తమకు కఠిన పరీక్షగా మిగిలినా.. చాలా విషయాలు నేర్పించిందన్నాడు. అప్పట్లో కివీస్‌‌ సారథి కేన్​ విలియమ్సన్‌‌ ఆట సూపర్‌‌ అని కితాబిచ్చాడు. ‘అప్పట్లో విలియమ్సన్‌‌ ఎదుర్కోవడం నాకు ఇంకా గుర్తుంది.  ఇతర ప్లేయర్లతో పోలిస్తే అతని బ్యాటింగ్‌‌ చాలా భిన్నంగా ఉంటుంది. కేన్‌‌, స్మిత్‌‌ సహా ఆ వరల్డ్‌‌కప్‌‌లో ఆడిన చాలా మంది ఇప్పుడు నేషనల్‌‌ టీమ్‌‌ల్లో ఆడుతున్నారు. ఏదేమైనా ఈ వరల్డ్‌‌కప్‌‌ నా కెరీర్‌‌లోనే అతి ముఖ్యమైన మైల్‌‌స్టోన్‌‌. మా కెరీర్లను నిర్మించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడింది. అందుకే దీనికి నా మదిలో, హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. దీనివల్ల వచ్చిన అవకాశాలను గౌరవించడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం’ అని విరాట్‌‌ పేర్కొన్నాడు. 2008 వరల్డ్‌‌కప్‌‌లో కోహ్లీ స్టార్‌‌గా నిలిస్తే, 2010 టోర్నీతో  బెన్‌‌ స్టోక్స్‌‌, బల్టర్‌‌, రూట్‌‌ సూపర్‌‌ స్టార్స్‌‌ అ య్యారు. ఇండియాపై స్టోక్స్‌‌ చేసిన సెంచరీని ఎప్పటికీ మర్చిపోలేమని రూట్‌‌ గుర్తు చేసుకున్నాడు.