రాజీనామాతో కోహ్లీ బ్రాండ్‌ వ్యాల్యూ పై ప్రభావం

రాజీనామాతో కోహ్లీ బ్రాండ్‌ వ్యాల్యూ పై ప్రభావం

T20 కెప్టెన్‌గా రాజీనామా చేయడంతో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ బ్రాండ్‌ వ్యాల్యూపై ఎఫెక్ట్ భారీగా పడే అవకాశముందటున్నారు మార్కెటింగ్ ఎక్స్ ఫర్ట్స్. మామూలుగా  పాపులర్‌ ఫార్మాట్‌ గేమ్‌కు కెప్టెన్‌గా ఉండటం కారణంగా భారీ క్రేజ్‌ ఉంటుంది. అలాగే బ్రాండ్ వ్యాల్యూ కూడా. ఇపుడు క్రేజీ స్థానం వొదిలేస్తే స్పాన్సరర్స్‌ కొనసాగుతారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. గతంలో సచిన్‌ వంటి దిగ్గజాలు కెప్టెన్సీ వొదిలేసిన వెంటనే జరిగిన పరిణామం అదే. ప్లేయర్‌గా మంచి ఫామ్‌లో ఉన్నా... కెప్టెన్‌గా ఉన్న ఫాలోయింగ్ వేరని అంటారు అడ్వర్టయిజ్‌మెంట్ నిపుణులు.

 గతేడాది వేసిన అంచనా ప్రకారం విరాట్‌ కోహ్లీ బ్రాండ్‌ వ్యాల్యూ 23.77 కోట్ల డాలర్లు. సెలబ్రెటీలలో కోహ్లీ దేశ వ్యాప్తంగా నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారు. దాదాపు ఆయనను ఎండార్స్‌ చేసే కంపెనీలు 40కిపైగా ఉన్నాయి. ఆయన ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రోజుకు రూ. 5 కోట్ల నుంచి రూ. 5.5 కోట్ల వరకు వసూలు చేస్తారని సమాచారం. ప్రస్తున్న కోహ్లీ కెప్టెన్సీ రాజీనామా ప్రకటనతో  మున్ముందు ఈ స్థాయి వ్యాల్యూయేషన్‌ ఉంటుందా  అని చర్చ జరుగుతోంది.  పాత క్రికెటర్లకు... కోహ్లీ జమానాకు ఓ పెద్ద మార్పు ఉందని ఆయన ఫ్యాన్స్‌ అంటున్నారు. గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ సమయంలో సోషల్‌ మీడియా లేదు. ఈ రంగంలో కోహ్లీకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉందని, ఇది కోహ్లీకి ఉన్న పెద్ద ప్లస్‌ పాయింట్‌ అంటున్నారు. ఈ కారణంగా  ఆయనకు పెద్దగా నష్టం ఉండదని ఆయన మద్దతుదారులు అంటున్నారు. సోషల్‌ మీడియా అపుడు లేకున్నా.. ఇపుడు అందరు ప్లేయర్లకు ఉందని... అది ఎప్పటికపుడు మారిపోయే డైనమిక్‌ ప్రపంచమని యాడ్‌ మార్కెటింగ్‌ నిపుణలు అంటున్నారు. మొత్తం కోహ్లీ బ్రాండ్‌ వ్యాల్యూపై ప్రభావం కచ్చితంగా ఉండే అవకాశముందంటున్నారు.