చినిగిన జీన్స్తో రావొద్దు.. స్టూడెంట్స్కు కాలేజీ వార్నింగ్

చినిగిన జీన్స్తో రావొద్దు.. స్టూడెంట్స్కు  కాలేజీ వార్నింగ్

చినిగిన జీన్స్ పాయింట్లు వేసుకుని కాలేజీకి రావొద్దంటూ విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది కోల్‌కతాలోని ఆచార్య జగదీష్ చంద్రబోస్ కాలేజీ. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కాలేజీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విద్యార్థులు చినిగిన లేదా అసభ్యకరమైన డ్రెస్సులు ధరించకుండా కోల్‌కతాలోని ఆచార్య జగదీష్ చంద్రబోస్ కాలేజీ నిషేధించింది. కాలేజీలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులందరూ ఈ అఫిడవిట్‌పై సంతకం చేయాలని తప్పనిసరి చేసింది. కాలేజీ యాజమాన్యం ఈ అఫిడవిట్‌పై తల్లిదండ్రుల సంతకాన్ని కూడా తప్పనిసరిగా సూచించింది. 

కాలేజీ యాజమాన్యం తీసుకున్న కొత్త నిర్ణయంపై కొందరు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలో మోరల్ పోలీసింగ్‌తో పాటు విద్యా వాతావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. ఈ కాలేజీలో ఆగస్టు 7వ తేదీ నుంచి కొత్త సెమిస్టర్ ప్రారంభమైందని తెలిపింది. ఈ క్రమంలోనే కళాశాల యాజమాన్యం తాజాగా ఈ నిబంధనలను జారీ చేసింది. అడ్మిషన్ తీసుకుంటున్న కొత్త, పాత విద్యార్థులతో పాటు ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది. 

ALSO READ:దేశం కోసమే ఒకే దేశం.. ఒకే ఎన్నికలు

కాలేజీ ప్రిన్సిపాల్ పూర్ణ చంద్ర మైతీ పెట్టిన అఫిడవిట్‌ నిబంధనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం అమలు చేయడమంటే.. తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్గించడమే అని చెప్పారు.