V6 News

సెమీస్‌లో కోనేరు హంపి

సెమీస్‌లో కోనేరు హంపి

చెన్నై: ఇండియా గ్రాండ్‌ మాస్టర్‌‌ కోనేరు హంపి.. వుమెన్స్‌ స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌‌ గ్రాండ్‌ప్రిలో సెమీస్‌కు చేరింది. గురువారం జరిగిన క్వార్టర్‌‌ ఫైనల్లో వరల్డ్‌ రెండో ర్యాంకర్‌‌ హంపి 6-5తో వాలెంటినా గునినా (రష్యా)పై గెలిచింది. గేమ్‌ ఆరంభం నుంచి అద్భుతమైన ఎత్తు లతో ఆకట్టు కున్న ఇండియన్‌ ప్లేయర్‌‌.. మధ్యలో కాస్త తడబడింది. ఈ క్రమంలో గునినా పుంజుకున్నా.. ఎండ్‌ గేమ్‌లో మాత్రం హంపి సూపర్‌‌ ఫినిషింగ్‌‌ ఇచ్చింది. మరో క్వార్టర్స్‌ గేమ్‌లో గ్రాండ్‌ మాస్టర్‌‌ ద్రోణవల్లి హారిక 3-9తో అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెమీస్‌లో హంపి.. హుయిఫాన్‌ (చైనా)తో తలపడుతుంది.