104 సిబ్బంది నిర్వాకం : బంధువుకు కొవిడ్ వ్యాక్సిన్ వేసిన హెల్త్ వర్కర్

104 సిబ్బంది నిర్వాకం : బంధువుకు కొవిడ్ వ్యాక్సిన్ వేసిన హెల్త్ వర్కర్

భద్రాచలం, వెలుగు: ఇప్పటివరకు హెల్త్ సిబ్బందికి మాత్రమే ఇస్తున్న కొవిడ్ వ్యాక్సీన్ ను భద్రాచలంలో పక్కదారి పట్టించిన ఘటన సోమవారం బయటపడింది. 104 వెహికల్ డ్రైవర్ తన బంధువుకు వ్యాక్సిన్ వేయించి, ఫేస్ బుక్ లో ఫొటో పోస్ట్ చేయడంతో విషయం బయటపడింది. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనపై జిల్లా కలెక్టర్.. ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రును ఎంక్వైరీకి ఆదేశించారు. ఈ నెల 21న కొవిడ్ వ్యాక్సిన్​ను 104 సిబ్బందికి ఇవ్వగా.. అందులో మిగిలిన ఒక యూనిట్ ని 104 డ్రైవర్ సంతోష్ తన బంధువును పిలిపించి సిబ్బందేనని పరిచయం చేసి ఆ వ్యాక్సిన్​ను ఇప్పించాడు. వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను వాట్సాప్‍, ఫేస్‍బుక్‍లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‍అయ్యి, ఐటీడీఏ పీవో గౌతమ్‍పోట్రు దాకా వెళ్లింది. ఆయన జిల్లా కలెక్టర్‍కు చెప్పడంతో ఎంక్వరీకి ఆదేశించారు. అడిషనల్ డీఎం అండ్ హెచ్​వో శ్రీనివాసరావు ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ సెంటర్ ప్రతినిధుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిపోర్టును ఐటీడీఏ పీవోకు అందజేస్తానని చెప్పారు.