ఇది మా నాన్న కోసం..ఫస్ట్​ వన్డేలో క్రునాల్​ రికార్డు ఫిఫ్టీ

ఇది మా నాన్న కోసం..ఫస్ట్​ వన్డేలో క్రునాల్​ రికార్డు ఫిఫ్టీ

  తండ్రిని తలచుకొని భావోద్వేగం

 స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ క్రునాల్‌‌‌‌ పాండ్యా  వన్డేల్లో తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ఫస్ట్‌‌‌‌ వన్డేలోనే ఫాస్టెస్ట్‌‌‌‌ ఫిఫ్టీ కొట్టిన క్రికెటర్‌‌‌‌గా రికార్డు సృష్టించాడు. తమ్ముడు హార్దిక్‌‌‌‌ పాండ్యా చేతుల మీదుగా వన్డే క్యాప్‌‌‌‌ అందుకున్న 30 ఏళ్ల క్రునాల్‌‌‌‌  26 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. దాంతో, న్యూజిలాండ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ జాన్‌‌‌‌ మోరిస్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.  అయితే, తన మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌ అనంతరం ఈ మధ్యే చనిపోయిన తన తండ్రిని గుర్తుచేసుకొని క్రునాల్‌‌‌‌ భావోద్వేగానికి గురయ్యాడు.  కామెంటేటర్‌‌‌‌ మురళీ కార్తీక్‌‌‌‌ ఇంటర్వ్యూ చేస్తుండగా తండ్రిని గుర్తుకుతెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ఇది  మా నాన్న కోసం’ అని మాత్రమే చెప్పగలిగాడు.  హార్దిక్‌‌‌‌ పాండ్యా వచ్చి తన అన్నను ఓదార్చాడు. గత మూడు నెలలు క్రునాల్‌‌‌‌కు చాలా కష్టంగా గడిచాయి. జనవరిలో ముస్తాక్‌‌‌‌ అలీ ట్రోఫీ క్యాంప్‌‌‌‌ టైమ్‌‌‌‌లో బరోడా టీమ్‌‌‌‌మేట్‌‌‌‌ దీపక్‌‌‌‌ హుడాతో గొడవ జరిగింది. ఈ ఘటనలో హుడాదే తప్పని తేలడంతో అతడిని ఈ సీజన్‌‌‌‌ నుంచి తప్పించారు. ఈ వివాదం జరిగిన కొన్ని వారాల్లోనే పాండ్యా బ్రదర్స్‌‌‌‌ తండ్రి హిమాన్షుహార్ట్‌‌‌‌ ఎటాక్‌‌‌‌తో మరణించాడు. అప్పుడు ముస్తాక్‌‌‌‌ అలీ బయో బబుల్‌‌‌‌ను వీడిన క్రునాల్‌‌‌‌ ఇంటికి చేరుకున్నాడు. అయితే నెల రోజుల్లోనే మళ్లీ గ్రౌండ్‌‌‌‌లోకి వచ్చిన అతను విజయ్‌‌‌‌ హజారే ట్రోఫీలో బరోడాను నడిపించాడు. ఐదు మ్యాచ్‌‌‌‌ల్లోనే రెండు సెంచరీలు, ఓ ఫిఫ్టీతో పాటు బౌలింగ్‌‌‌‌లోనూ రాణించి వన్డే టీమ్‌‌‌‌కు ఎంపికయ్యాడు.