వికారాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. పేపర్ ప్లేట్ తయారీ కేంద్రంలో మంటలు చెలరేగడంతో యంత్రాలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఆదివారం ( ఏప్రిల్ 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కుల్కచర్ల మండల కేంద్రంలో పేపర్ ప్లేట్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో పేపర్ ప్లేట్ తయారీ కేంద్రంలోని పేపర్ ప్లేట్లతో పాటు యంత్రాలు కూడా పూర్తిగా దగ్దమయ్యాయి.స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే యంత్రాలు, స్టాక్ పూర్తిగా దగ్దమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

