కుల్ భూషణ్ జాదవ్ కేసు : ఇవాళ భారత్ వాదనలు

కుల్ భూషణ్ జాదవ్ కేసు : ఇవాళ భారత్ వాదనలు

పాకిస్తాన్ జైల్లో బందీగా ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో.. అంతర్జాతీయ న్యాయస్థానం ఇవాల్టి నుంచి వాదనలు విననుంది. మొత్తం నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ న్యాయస్థానం వాదనలు వింటుంది. ఇవాళ మన దేశం వాదన వినిపిస్తుంది. రేపు పాకిస్తాన్ వాదనలు వినిపిపంచాక.. ఎల్లుండి భారత్ సమాధానమిస్తుంది. 21న పాక్ తుది వాదనలు వినిపిస్తుంది. మరో రెండు మూడు నెలల్లో ఈ కేసులు తుది తీర్పు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.