బడంగ్ పేట వినాయకుడి లడ్డూ వేలం రూ.12 లక్షలకు

బడంగ్ పేట వినాయకుడి లడ్డూ వేలం రూ.12 లక్షలకు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినాయక మండపాల వద్ద లడ్డూ వేలంపాట శుక్రవారం కోలాహలంగా జరిగింది. భక్తులు పోటీపడి మరీ లడ్డూ ప్రసాదాన్ని కొన్నారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు వెచ్చించారు. వివరాల్లోకి వెళితే..

  • రంగారెడ్డి జిలా బడంగ్ పేట వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లడ్డూ వేలం పాట నిర్వహించగా.. అందెల శిరీష అనే మహిళ రూ.12 లక్షలకు దక్కించుకుంది. 
  • కర్మన్ ఘాట్​ మాధవరం సెరినిటీలో నిర్వహించిన వేలం పాటలో జగన్మోహన్ గౌడ్ అనే వ్యక్తి రూ.11 లక్షల 11వేల116కు లడ్డూను సొంతం చేసుకన్నాడు.  
  • మూసాపేట పరిధిలోని సేవాలాల్​నగర్​లో జరిగిన వేలంలో లడ్డూ ధర రూ.7లక్షల 80 వేలు, కేపీహెచ్​బీ సర్దార్ పటేల్ నగర్​లో రూ.6 లక్షల 52 వేలు పలికింది.    
  • కూకట్ పల్లి బీజేపీ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన మండపంలో రూ.5 లక్షల 25 వేలు పలికింది.
  • మూసాపేట  రాఘవేంద్ర సొసైటీ వద్ద మండపంలో లడ్డూ ధర రూ.2 లక్షల 92 వేలు పలికింది.
  • శేరిలింగంపల్లి మార్కెట్​లో వేలం పాట నిర్వహించగా లడ్డూ ధర రూ.3 లక్షల 80 వేలు, చందానగర్ పరిధిలోని తారానగర్​లో రూ. లక్షా 76 వేలు,  లంగర్ హౌస్​లోని గాంధీనగర్ అసోసియేషన్​లో రూ.2 లక్షల 15 వేలు పలికింది. 
  • కార్వాన్ సబ్జీమండి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్​ మండపం వద్ద రూ.లక్షా 16 వేలకు బీజేపీ నాయకుడు రాకేశ్ లడ్డూను దక్కించుకున్నాడు.
  • బన్సీలాల్ పేట ఐడీహెచ్ కాలనీలో రూ. లక్షా 25 వేలు, రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో వీహెచ్​పీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేలం పాట జరగా.. లడ్డూ ధర రూ.లక్షా 36 వేల116 పలికింది.
  • దిల్ సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ సమీపంలోని ఉమేశ్​చంద్ర పోలీస్ అకాడమీ కోచింగ్ సెంటర్​లో ఏర్పాటు చేసిన మండపంలో సంస్థ డైరెక్టర్ కొండవీటి అంజిబాబు ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాట నిర్వహించారు. ఆఫీస్ స్టాఫ్ ఆంజనేయులు రూ.25 వేల 500కు లడ్డూను సొంతం చేసుకున్నాడు.
  • అత్తాపూర్ పోచమ్మ టెంపుల్​లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ధర రూ.8 లక్షల 11వేలు పలికింది.
  • మణికొండలోని నవజ్యోతి యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో రూ.9 లక్షల 29 వేలకు స్థానిక వ్యక్తి లడ్డూను దక్కించుకున్నాడు.
  • గండిపేట మండలం ఖానాపూర్​లో వివేకానంద యూత్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో రూ. 4 లక్షల 50 వేలకు లడ్డూ ధర పలికింది. 
  • రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం లింగారెడ్డి గూడ గ్రామంలో స్థానిక వ్యక్తి రూ. 2 లక్షల 62 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు.
  • వికారాబాద్ జిల్లా కేంద్రం ఇంద్రనగర్​లో   లడ్డూను రూ. 2 లక్షల 61 వేలకు స్థానిక వ్యక్తి దక్కించుకున్నాడు.