రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్

రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. రేవంత్  ఎప్పుడూ ఎక్సర్‌సైజ్‌లు, వర్కౌట్‌లు చేస్తుంటారని  అన్నారు. భుజంపై చేయి వేసి రేవంత్ ను ప్రశంసించారు. రేవంత్ తో కలిసి నడుచుకుంటూ  హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లారు.  ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన రేవంత్ ఫ్యాన్స్, కాంగ్రెస్ శ్రేణులు   దటీజ్ మై లీడర్..రేవంతన్నా మజాకా అంటూ కామెంట్ చేస్తున్నారు.

 ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 5న రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఉదయం నిర్మల్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్ లో జిల్లాలోని అలంపూర్ లో జనజాతర సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన రాహుల్.. ఈ ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని   అన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇండియా కూటమి పోరాటం చేస్తోందన్నారు.  రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తేమని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలో 50 శాతం మంది ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.