జర్నలిస్టును తిట్టిన కేంద్ర మంత్రి

జర్నలిస్టును తిట్టిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఓ జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి లఖీంపూర్ ఖేరీకి అజయ్ మిశ్రా వచ్చారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు లఖీంపూర్ కేసును ప్రస్తావిస్తూ మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు సిట్ దర్యాప్తు విచారణ గురించి ప్రశ్న అడిగారు. దీంతో సహనం కోల్పోయిన అజయ్ మిశ్రా.. ఆ విలేకరిని బూతులు తిట్టారు. మైకులు లాక్కొని జర్నలిస్టులపై దాడికి ప్రయత్నించారు.

నిర్దోషులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. మీడియాకు సిగ్గు లేదంటూ ఆ జర్నలిస్టుపై మంత్రి తిట్ల దండకం అందుకున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా లఖీంపూర్ ఖేరీలో నిరసనలు చేస్తున్న రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు అన్నదాతలు మృతి చెందగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

రోహిత్తో ఎలాంటి విభేదాల్లేవ్

జవాన్ సోదరి పెళ్లి.. అన్న లేని లోటు తీర్చిన ఆర్మీ

వీడియో: పల్లకి తెగి కిందపడిన కొత్త జంట