
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ఓ పెళ్లివేడుకలో అపశృతి చోటు చేసుకుంది. ఫొటో షూట్ చేస్తుండగా వధూవరులు ఉన్న పల్లకి తెగిపోయింది. వివాహానికి ముందు వేదికపైకి వధూవరులు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఈవెంట్ మేనేజర్లు హ్యాంగింగ్ పల్లకి ఏర్పాటు చేశారు. పల్లకి గాలిలోకి లేవగానే రోప్ తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా పెళ్లికొడుకు, పెళ్లికూతురు దాదాపు 12 ఫీట్ల ఎత్తు నుంచి కిందపడిపోయారు. స్వల్ప గాయాలతో కొత్త దంపతులు బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన మరో అర్ధగంటకు కార్యక్రమం తిరిగి మొదలైంది. ఈ ఘటనకు ఈవెంట్ నిర్వాహకులు పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపారు.
Unfortunate accident at Raipur Wedding yesterday.
— Amandeep Singh ? (@amandeep14) December 12, 2021
Thank God all are safe.
source : https://t.co/yal9Wzqt2f pic.twitter.com/ehgu4PTO8f
For More News..
తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ
ఉప్పల్ స్టేడియానికి కరెంట్ నిలిపివేత