తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ

తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ

తెలంగాణోకి ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 12వ తేదీ కెన్యా నుంచి వచ్చిన 24 ఏళ్ల యువతికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. కెన్యా సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన 24ఏళ్ల యువతికి, సోమాలియా నుంచి వచ్చిన 23 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. దీంతో వీరిని గచ్చిబౌలి టిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. టోలిచౌకిలోని యువతి ఇంటి అడ్రస్ అధికారులు కనుగొన్నారు. దీంతో  ఆ ఇంట్లో వారిని కూడా క్వారంటైన్ కు తరలించారు. వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తిస్తున్నామన్నారు. అయితో మరో బాలుడుకు కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. అయితే ఆ అబ్బాయి ఎయిర్ పోర్టు నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయాడని తెలిపారు.

మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ ఎంట్రీతో డీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో ఈ కేసులు డబుల్ అవుతాయన్నారు హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాస్ రావు. లక్షణాలు ఉన్న ప్రతీ ఒకరు టెస్ట్ చేయించుకోవాలనుకున్నారు. 77 దేశాల్లో ఒమిక్రాన్ ఉందన్నారు. చాలా వేగంగా విస్తరిస్తుందన్నారు డీహెచ్. . గచ్చిబౌలి టిమ్స్ లో చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రతీ ఒకరు అప్రమత్తంగా ఉండాలన్నారు డీహెచ్. ప్రతీ ఒకరు తప్పని సరిగా మాస్క్ ధరించాలన్నారు. మాస్క్ లేకుండా బయటకు రావొద్దన్నారు. ఇంట్లో బయట ఎక్కడ ఉన్నా మాస్క్ విధిగా వాడాలన్నారు. కేవలం తినేటప్పుడు మాత్రమే మాస్క్ తీయాలన్నారు డీహెచ్.

For More News..

పర్మిట్ ​రూంలోనే ప్రాణం పోయింది

గుడ్ న్యూస్.. ఒమిక్రాన్ పై పనిచేస్తున్న ఫైజర్ గోలి