తిరుమల మ్యూజియం దగ్గర చిరుతపులి సంచారం

తిరుమల మ్యూజియం దగ్గర చిరుతపులి సంచారం

తిరుమలలో గత అర్ధరాత్రి చిరుత పులి హల్ చల్ చేసింది. మాడవీధికి సమీపంలో ఉన్న మ్యూజియం దగ్గర గోడపై కాసేపు కూర్చున్న ఆ చిరుత అక్కడే కొద్దిసేపు తిరిగి ఆ తర్వాత శ్రీవారి పాదాల అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డు కావడం… ఈ విషయం తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదం తీసుకుని భక్తులు బయటకు వచ్చే రోడ్డులోనే చిరుత తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా తిరుమల క్షేత్రం కొన్నాళ్లు మూతపడింది. ఆ తర్వాత తిరిగి తెరుచుకున్నా మునుపటిలా భక్తుల సందడి కనిపించడంలేదు. దాంతో జంతువులు ఎలాంటి బెరుకు లేకుండా తిరుమల వీధుల్లో సంచరిస్తున్నాయి.ఇటీవల ఓ చిరుత రెండో ఘాట్ రోడ్డులో వాహన దారులపై దాడికి పాల్పడిన ఘటన జరిగింది.