పార్లమెంట్‌‌లో అధిర్ రంజన్‌‌కు అవకాశం ఇస్తలేరు

పార్లమెంట్‌‌లో అధిర్ రంజన్‌‌కు అవకాశం ఇస్తలేరు

రాష్ట్రపతిని ఉద్దేశించి పొరపాటున వ్యాఖ్యలు దొర్లాయని.. ఇందుకు ఎంపీ అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాడని.. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ సూచించారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టే ముందు, తాను పొరపాటు చేసినట్లు.. మాట తప్పిందని ఆయన వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎలాంటి చెడు ఉద్దేశం లేదని అధిర్ చెప్పాడన్నారు. కానీ అతడికి పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఎవరైనా సమయం కోరినప్పుడు, స్పీకర్ వారిని కూర్చోమని చెప్పడం సబబు కాదన్నారు.

జీరో సమయంలో వారికి సమయం లభిస్తుందని తెలిపారు. కానీ.. బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ మాట్లాడినప్పుడు ఎవరూ అడ్డుకోలేదన్నారు. ఏకంగా ఆమె 10 నిమిషాల పాటు మాట్లాడినట్లు తెలిపారు. పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలపై తాము సంతోషంగా లేమని వెల్లడించారు. అధీర్ రెండు సార్లు మాట్లాడేందుకు ప్రయత్నించినా.. అతని మైక్ ఆన్ చేయలేదన్నారు. ఈ పరిస్థితుల్లో తాము ఏం చేయగలమన్నారు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అసలు ఇది సమస్యే కాదని..దేశంలో చాలా తీవ్రమైన సమస్యలున్నాయన్నారు. తప్పు చేశాడు.. అధీర్ అంగీకరించాడని ఇది వదిలేసి ముందుకు వెళ్దామని మరోసారి సూచించారు.