కొత్త కరెన్సీ ‘లిబ్రా

కొత్త కరెన్సీ ‘లిబ్రా

‘లిబ్రా’ ఓ వైట్ పేపర్ కరెన్సీ. అంటే దాన్ని ముట్టుకోలేం. మన దగ్గర ఇంత డబ్బు ఉందని కేవలం ఒక పేపర్ పై మాత్రమే చూసుకోగలం. కానీ అవసరమైన వస్తువులను హైదరాబాద్ లో మన ఇంట్లో కూర్చుని, ప్రపంచంలో ఎక్కడున్నా ఆర్డర్ చేసేసుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలను ఫేస్ బుక్ బయటపెట్టడం లేదు. ఇందుకు సస్పెన్స్ మార్కెటింగ్ ఒక కారణం. రెండు లిబ్రా చాలా దేశాల రూల్స్ ను బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరో కారణం లిబ్రా ప్రస్తుతం డెవలప్ మెంట్ దశలో ఉంది. పూర్తిగా రెడీ కానీ దేని గురించి వివరాలు బయటపెట్టేందుకు కంపెనీలు ఇష్టపడవు. చాలా మంది లిబ్రాను క్రిప్టో కరెన్సీ అని పిలిచారు. కానీ ఫేస్ బుక్ మాత్రం అలా చెప్పలేదు.

లిబ్రా క్రిప్టో కరెన్సీనా?

క్రిప్టోకరెన్సీతో మనీ లాండరింగ్, అనధికారిక ట్రాన్సాక్షన్లు నడుస్తున్నాయి. అందుకే ఫేస్ బుక్ ‘లిబ్రా’ను క్రిప్టోకరెన్సీగా పేర్కొనలేదని నిపుణులు అంటున్నారు. బిట్ కాయిన్ ఓ క్రిప్టోకరెన్సీ. రోజూ దీని వాల్యూ మారిపోతూ ఉంటుంది. ఈ ఏడాది బిట్ కాయిన్ వాల్యూ వృద్ధి 200 శాతం కంటే ఎక్కువగా కొనసాగుతోంది. లిబ్రా వాల్యూ రోజు రోజుకూ మారిపోదు. దీని కోసం ఓ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారు. మార్కెట్లో వచ్చే ఆటుపోట్లను తట్టుకుని నిలబడేందుకు నిధిలోని డబ్బును వాడతారు. అంతేకాకుండా లిబ్రాను 100 మంది సభ్యులతో కూడిన ‘గవర్నింగ్ కౌన్సిల్’ పర్యవేక్షిస్తుంది. ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీని హెడ్ కార్టర్స్ ను స్విట్జర్లాండ్ లో ఏర్పాటు చేశారు. గవర్నింగ్ కౌన్సిల్ లో వీసా, మాస్టర్ కార్డ్, స్పాటిఫై, పే పాల్,  ఉబర్, పే యూ, లిఫ్ట్, ఇలియడ్, థ్రైవ్ కాపిటల్, స్ట్రైప్, ఈబే తదితర మల్టీ నేషనల్ కంపెనీలు సభ్యులుగా ఉంటాయి. ఇవి అవసరాన్ని బట్టి అందరి ఓటింగ్ తో లిబ్రా వాల్యూలో మార్పులు చేయొచ్చు. ఒక వేళ ఓటింగ్ వీగి పోతే లిబ్రా వాల్యూ యథావిధిగా కొనసాగుతుంది. గవర్నింగ్ కౌన్సిల్ లో సభ్యులుగా చేరడానికి ఒక్కో కంపెనీ ముందుగా 10 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాల్సివుంటుంది.

సెంట్రలైజ్డ్ కరెన్సీయా.. కాదా?

టెక్నికల్ ప్రపంచంలో లిబ్రాను సెంట్రలైజ్జ్ కరెన్సీగానే పిలుస్తున్నారు. దీనికి కారణం గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో లిబ్రాను నిర్వహించడం. లిబ్రాను ‘ఇంటర్నెట్ మనీ’గా కూడా పిలుస్తున్నారు. అతి తక్కువ ఖర్చు, శ్రమతో డబ్బును సింగిల్ మెసేజ్ తో ప్రపంచంలో ఎక్కడి నుంచి, ఎక్కడికైనా పంపే సదుపాయమే దానికి ఈ పేరు తెచ్చి పెట్టింది. అంటే వైర్ ట్రాన్స్ ఫర్ల కోసం మూడు నుంచి ఐదు రోజుల పాటు ఎదురుచూడాల్సిన పని లేదన్నమాట. అంతేకాదు బ్యాంకుల మొహం చూడని 170 కోట్ల మంది ప్రజలకు ఫైనాన్షియల్ సర్వీసులను లిబ్రా అందుబాటులోకి తెస్తుంది. దీని వల్ల ఆర్థిక వృద్ధి బాగా పెరుగుతుంది.

మోసానికి అవకాశమే లేదు

హైదరాబాద్ లోని మీరు లిబ్రాతో బ్రెజిల్ లోని కాఫీ గింజల్ని కొనాలని అనుకున్నారు. ఓ 10 టన్నులు ఆర్డర్ చేశారు. దాన్ని కాఫీ గింజల కంపెనీ ప్యాక్ చేస్తుంది. డెలివరీకి పంపే ముందు లిబ్రాకు చెందిన ఓ కంపెనీ, ఆర్డర్ చేసిన బరువు, కాఫీ కంపెనీ ప్యాక్ చేసిన మొత్తాన్ని సరి చూస్తుంది. ఒకవేళ ఆ రెండు కంపెనీలు కుమ్మక్కై మిమ్మల్ని మోసం చేద్దామని అనుకున్నాయని అనుకుందాం. అప్పుడు మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆర్డర్ పెట్టుకోవచ్చు. బ్రెజిల్ కాఫీ మార్కెట్లో ఉండే స్వతంత్ర వ్యాపారుల వద్ద దీని కోసం ఓ ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది. సరైన తూకాన్ని ఎంపిక చేసిన మొదటి 25 మంది వ్యాపారులకు లిబ్రా కమిషన్ చెల్లిస్తుంది. దీంతో ఆర్డర్ రాగానే వ్యాపారులందరూ సరైన తూకాన్ని ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కువ మంది నమోదు చేసిన తూకాన్ని, బ్లాక్ చైన్ బ్లాక్ చేస్తుంది. అదే వెయిట్ తో డెలివరీ అయ్యేలా చూస్తుంది. ఈ ప్రాసెస్ లో వ్యాపారులకు ఒకరితో మరొకరికి కాంటాక్టులు ఉండవు. ఫలితంగా మోసానికి అవకాశం ఉండదు. సో.. మన డబ్బు సేఫ్. అంతర్జాతీయ మార్కెట్లో మంచి ప్రొడక్టు కొనుక్కోవచ్చు.

లిబ్రాకు యెస్ చెబితేనే మంచిది

ఆర్బీఐకు చెందిన రూల్స్ ను పాటించకపోయినా, ఇండియా లిబ్రాను అనుమతించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వీసా, మాస్టర్ కార్డు, పేపాల్ లాంటి సంస్థలు ట్రాన్స్ ఫర్లపై వేస్తున్న చార్జీలను తగ్గించడం లేదు. ఫారెన్ కరెన్సీని మారిస్తే బాదుడే బాదుడే. కనీసం 2 నుంచి 7 శాతం ఫీజు లాగుతున్నాయి. లిబ్రాతో కరెన్సీ ట్రాన్స్ ఫర్ చేస్తే వేసే చార్జ్ వీటితో పోల్చితే అతి తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న రూపంలో ‘లిబ్రా’ను ఇండియాలో వాడటానికి అనుమతి లేదని రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. దీని వల్ల దేశ మానిటరీ పాలసీ దెబ్బతినొచ్చంది. ఉదాహరణకు దేశ మార్కెట్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆర్బీఐ మరింత డబ్బును పంప్ చేసి, వస్తు కొనుగోళ్లు పెంచాలని చూస్తుంది. ఈ సమయంలో ప్రజలు డబ్బును లిబ్రాలోకి మార్చుకుని భద్రంగా దాచుకునే చాన్స్ ఉంది. దీని వల్ల ఆర్బీఐ పాలసీ పూర్తిగా దెబ్బతింటుంది. ఆర్బీఐ వేలెత్తి చూపుతున్న మరో కారణం కేవైసీ. లిబ్రాకు ఫేస్ బుక్ కేవైసీ రూల్స్ ను పాటిస్తామని ఇప్పటికే ప్రకటించింది. కానీ మన దేశంలోని బ్యాంకులు అకౌంట్ తెరవడానికి ఫాలో అవుతున్న కేవైసీ రూల్స్ తో పోలిస్తే ఫేస్ బుక్ కేవైసీ రూల్స్ అంత స్ట్రాంగ్ గా లేవు. మరో సాంకేతిక సమస్య ఏంటంటే ఆర్బీఐ, ఫేస్ బుక్ ను ఇతర దేశీయ సంస్థల్లా పర్యవేక్షించలేదు. మరో సమస్య ఫెమా రూల్స్. లిబ్రాను ప్రపంచంలో ఎక్కడికైనా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఓ ఇండియన్, లిబ్రాను ఇండియన్ రూపీస్ లో కొనుగోలు చేస్తాడు. ఒక వేళ అతను ఫారెన్ లోని తన స్నేహితుడికి డబ్బు పంపితే, దాన్ని అక్కడున్న వ్యక్తి స్థానిక కరెన్సీలో విత్ డ్రా చేస్తాడు. ఇది మన ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తుంది.