యువత నైపుణ్యం పెంచుకోవాలి: విద్యాసాగర్ రావు

యువత నైపుణ్యం పెంచుకోవాలి: విద్యాసాగర్ రావు

యువతీ, యువకులు చిన్న చిన్న వృత్తులకే పరిమితం కావొద్దన్నారు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు.జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో టాటా స్ట్రెయి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు విద్యాసాగర్ రావు. అనంతరం మాట్లాడిన ఆయన  గ్రామీణ ప్రాంత యువకుల్లో నైపుణ్యం పెంచేందుకు ఏడాది పాటు ఇక్కడ జరిగే శిక్షణ ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రయివేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నా నైపుణ్యం ఉన్నవారు దొరకడం లేదన్నారు. నైపుణ్యంతో కూడిన విద్యా చాలా అవసరమన్నారు. వృత్తి నైపుణ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ ఉందని.. వేలల్లో ఆదాయం వస్తుందన్నారు. తమకున్న నైపుణ్యానికి మెరుగులు దిద్దుకునేందుకు శిక్షణ తీసుకోవాలని సూచించారు విద్యాసాగర్ రావు.