ఒకే చోట బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేయాలె

ఒకే చోట బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేయాలె

ఊరంతా అందరూ ఒకే దగ్గర బతుకమ్మ ఆడే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని అరుణోదయ సంసృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. కుల వివక్షతకు, పరువు హత్యలకు వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ నిర్వహించాలన్నారు. కులాలు, మతాలు లేవు ఊరు వాడ కలిసి ఆడుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని గన్ పార్కు వద్ద  విమలక్క బహుజన బతుకమ్మ ఆడారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడుదాం.. అది లేకపోతే మానవ సమాజం మనుగడ అంతరించిపోయే ప్రమాదం ఉందని తెలియజేస్తామని చెప్పారు. వనరుల సంపద ప్రజలదే అంటూ నినదిస్తూ... ముందుకు సాగుతామన్నారు.  బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కుల వివక్షతను, పరువు పేరిట జరుగుతున్న దారుణాలను వ్యతిరేకిస్తూ బహుజన బతుకమ్మ జరుపుతామని ఈ సందర్భంగా విమలక్క స్పష్టం చేశారు.