తల్లిదండ్రులను భుజాలపై వందల కి.మీ. మోస్తూ..

తల్లిదండ్రులను భుజాలపై వందల కి.మీ. మోస్తూ..

తల్లిదండ్రులకు ఒక్క పూట అన్నం పెట్టేందుకే ఆలోచించే కొడుకులున్న ఈ రోజుల్లో..  ఏదైనా బరువుతో కొద్దిసేపు నడిస్తేనే... అబ్బ అలసిపోయాను అని అనుకునే ఈ రోజుల్లో... వందల కిలోమీటర్లు నడుస్తూ.. అది కూడా ఒక్కడే అనుకున్నారా... కాదు భుజాలపై తన తల్లిదండ్రులను కూడా మోసుకెళ్తూ... వారిపై మమకారాన్ని చాటుకుంటున్నాడు ఓ కుమారుడు. ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ కు చెందిన వికాస్ గహ్లోత్ అనే యువకుడు.. కన్వర్ యాత్రను పూర్తి చేయాలన్న తన తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలనుకున్నాడు. దీంతో వ-ృ-ద్ధాప్యంలో ఉన్న ఆ దంపతుల కోసం వికాస్ సాక్షాత్తూ కలియుగ శ్రవణుడి అవతారమెత్తాడు. గాజియాబాద్ నుంచి హరిద్వార్ వరకు వారిని తీసుకెళ్లి గంగా స్నానం ఆచరించాడు. పవిత్ర జలం సేకరించి అక్కడి నుంచి 200 కి.మీ. దూరంలో ఉన్న గాజియాబాద్ కు కావడి యాత్ర ప్రారంభించాడు. ఇక తన తల్లిదండ్రులిద్దరినీ భుజాలపై మోస్తూ.. యాత్రను ఆరంభించాడు. తన కష్టాన్ని అమ్మానాన్నలు చూడకుండా వారికి కళ్లకు గంతలు కట్టాడు. 


కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా వార్షిక కన్వర్ యాత్ర రద్దు చేయబడింది. ఇటీవల జూలై 14న ప్రారంభమైన ఈ యాత్రకు ..  దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో  వికాస్ ఇలా తన తల్లిదండ్రులను భుజాలపై మోస హృదయాన్ని హత్తుకునే వీడియోను అశోక్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ షేర్ చేశారు. .. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.