ఎంపీ, ఎమ్మెల్యేను అడ్డుకున్న మందమర్రి గ్రామస్తులు

ఎంపీ, ఎమ్మెల్యేను అడ్డుకున్న మందమర్రి గ్రామస్తులు

    రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేల అడ్డగింత

    సమస్యలు పరిష్కరించడం లేదంటూ గ్రామస్తుల ఆగ్రహం

     రోడ్డు వేస్తాం, బ్రిడ్జి నిర్మిస్తామని హామీ.. శాంతించిన గ్రామస్తులు

మందమర్రి, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలంంటూ పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్​ నేత, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని మందమర్రిలో రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఏండ్లుగా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాగుపై బ్రిడ్జి లేక ఏడు గ్రామాల వారు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. గ్రామస్తులకు ఎంపీ, ఎమ్మెల్యేలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘మీ కోసమే వచ్చాం. ఇష్టమైనట్లు మాట్లడితే ఏం వస్తుంది. మేం వెళ్లిపోతే ఏం లాభం’అంటూ ఎంపీ పేర్కొన్నారు. రూ.1.18 లక్షలతో రోడ్డు చేయిస్తానని, తర్వాత బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.