13వ  ఫ్లోర్ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

13వ  ఫ్లోర్ పై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

అపార్ట్ మెంట్ 13వ  ఫ్లోర్ పై నుంచి దూకి వివాహిత సూసైడ్ చేసుకుంది. ఇన్స్ పెక్టర్ రవీందర్ తెలిపిన ప్రకారం.. రాజస్థాన్ కి చెందిన ఆశిష్, శ్వేత(35) దంపతులు నల్లగండ్లలోని అపర సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలోని బ్లాక్ నెంబర్ నం.1, ఫ్లాట్ నం.1–1303లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. ఆశిష్ హెచ్ఎస్ బీసీ బ్యాంక్ కొండాపూర్ బ్రాంచిలో పని చేస్తున్నా డు. ఆదివారం రాత్రి10.30 కు శ్వేత ఫ్లాట్ బెడ్రూం బాల్కనీ నుంచి కిందకి దూకేసింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చందానగర్ పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా యి. ఆదివారం మధ్యాహ్నం కూడా మరోసారి వీరిమధ్య గొడవ జరిగిందని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు.