2.5 కోట్ల వెహికల్స్​ ప్రొడక్షన్​ మైలురాయిని చేరుకున్న మారుతీ సుజుకీ

2.5 కోట్ల వెహికల్స్​ ప్రొడక్షన్​ మైలురాయిని చేరుకున్న మారుతీ సుజుకీ

న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌ఐ) బుధవారం 2.5 కోట్ల వెహికల్స్​ ప్రొడక్షన్​ మైలురాయిని చేరుకుంది. ఈ కంపెనీ డిసెంబర్ 1983లో ప్రొడక్షన్​ని ప్రారంభించింది. మరుసటి ఏడాదే 10 లక్షల ప్రొడక్షన్​ మార్కును దాటింది. ఇది మార్చి 2011లో  -కోటి మార్కును,  జూలై 2018లో రెండు -కోట్ల మైలురాయిని దాటింది. దీని మొదటి ప్రొడక్షన్​ సెంటర్‌‌  హర్యానాలోని గురుగ్రామ్‌‌‌‌లో ప్రారంభమైంది. కంపెనీకి ఇప్పుడు హర్యానాలోని గురుగ్రామ్  మనేసర్‌‌‌‌లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. 

వీటి ప్రొడక్షన్​ సామర్థ్యం సంవత్సరానికి 15 లక్షల యూనిట్లు. కంపెనీ దేశీయ మార్కెట్‌‌‌‌లో 16 ప్యాసింజర్ వెహికల్స్​ను విక్రయిస్తోంది.  దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేస్తోంది. " భారతదేశ ప్రజలతో సుజుకి  భాగస్వామ్యానికి 40 సంవత్సరాలు నిండాయి. ఈ సంవత్సరం 25 మిలియన్ల  ప్రొడక్షన్​ మైలురాయిని దాటడం సంతోషంగా ఉంది. ఇండియాతో మా కమిట్​మెంట్​కు,   భాగస్వామ్యానికి ఇది నిదర్శనం" అని ఎంఎస్​ఐ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ హిసాషి టేకుచి తెలిపారు. ప్యాసింజర్ వెహికల్స్​కు పెరుగుతున్న డిమాండ్‌‌‌‌ను తీర్చడానికి, హర్యానాలోని ఖర్ఖోడాలో కొత్త  ప్లాంటును నిర్మిస్తున్నామని వెల్లడించారు.