మెట్రో రైల్ లో తరచూ సాంకేతిక సమస్యలు

మెట్రో రైల్ లో తరచూ సాంకేతిక సమస్యలు
  • లక్డీకాపూల్ స్టేషన్​లో కొద్దిసేపు పనిచేయని సిగ్నల్స్​

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముసారంబాగ్ లో మెట్రో రైళ్లు మొరాయించడంతో  20నిమిషాల పాటు మెట్రో పట్టాల మీదే ఉంచారు. దాంతో ఎల్బీనగర్ టూ మియాపూర్ రూట్లో కొద్ది సేపు మెట్రో రాకపోకలు నిలిచాయి. మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం సాయంత్రం లక్డీకాపూల్ మెట్రో స్టేషన్​లో సాంకేతిక సమస్యలతో ట్రాక్‌‌‌‌ పైనే ట్రైన్ నిలిచిపోయింది. దీంతో మియాపూర్ నుంచి ఎల్‌‌‌‌బీనగర్ కారిడార్​లో రైళ్ల రాకపోకలు 15 నిమిషాల పాటు తాత్కాలికంగా నిలిచాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో అన్ని స్టేషన్లు ప్యాసింజర్లతో రద్దీగా మారాయి. అర్ధాంతరంగా ఆగడంతో ప్యాసింజర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పొల్యూషన్ కారణంగానే టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతున్నాయని చెబుతున్నారు మెట్రో అధికారులు.


హైదరాబాద్ లోని రెడ్ లైన్  మెట్రో రూట్ లో మంగళవారం సేవలు ఆగాయి. సాంకేతిక లోపంతో మెట్రో రైలు మూసరాంబాగ్  స్టేషన్ లో నిలిచిపోయింది. విద్యుత్ అంతరాయాలు, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలతోనే తరచూ మెట్రో రైళ్లు పట్టాలపై నిలిచిపోతున్నాయి. దాంతో జనం ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల మెట్రో రైళ్లు పీక్ అవర్స్ లో ఫ్రీక్వెన్సీ 7 నుంచి 10 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వస్తోందంటున్నారు మెట్రో ట్రావెలర్స్. హైదరాబాద్ మెట్రో రైళ్లు కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ తో ఆపరేట్ చేస్తుంటారు. గతంలో కూడా మెట్రో రైళ్లు చాలా సార్లు టెక్నికల్ ఇష్యూస్ తో ఆగిపోయాయి. నగరంలో వాతావరణ కాలుష్యంతో మెట్రో రైల్ సిగ్నలింగ్ పై ఎఫెక్ట్ పడుతోందని అంటున్నారు అధికారులు. గత నాలుగేళ్లల్లో చాలా సార్లు మెట్రోలో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. ఫ్లెక్సీలు పడిపోవడం, వర్షాలు పడితే ట్రైన్స్ ఆగిపోవడం, సమ్మర్ లో పొల్యూషన్ కారణంగా సున్నితమైన ఎలక్ట్రానిక్ పరికరాలపై దుమ్ము పేరుకోవడంతో టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయతే ప్రభుత్వం మెట్రో రైల్ సేఫ్టీ పరంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలంటున్నారు పర్యావరణవేత్తలు. రాబోయే వర్షాకాలంలో గాలి దుమారాలు, వానల ప్రభావంతో మెట్రో రైళ్ళల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే చర్యలు తీసుకోవాలంటున్నారు. 

మెట్రోలో ఉదయం, సాయంత్రం ఆఫీస్ టైమింగ్స్ లో ట్రైన్స్ ఫుల్ అవుతున్నాయి. ఒక ట్రైన్ మిస్ అయితే  10 నిమిషాల దాకా ఎదురు చూడాల్సి వస్తోంది. ఇప్పటికే ప్రయాణీకులు మెట్రో ఫ్రీక్వెన్స్ పై సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు. కోవిడ్ ప్యాండమిక్ తర్వాత తగ్గిన మెట్రో ప్రయాణికుల సంఖ్య మళ్లీ కొన్ని రోజులుగా పెరుగుతోంది. అయితే మెట్రో రైళ్లు ఆగిపోవడం, ఫ్రీక్వెన్సీ పెంచకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైల్ అధికారులు వీటిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
నోట్... ఒక బైట్ డెస్క్ వాట్సప్ లో ఉంది వాడుకోగలరు.

 

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ ఆస్తులను వదిలేసి ప్రజలపై బల్దియా ప్రతాపం

బర్త్​కు బదులు డెత్​ తప్పులతడకగా సర్టిఫికెట్ల జారీ

అనుమతి లేకుండా స్లాటర్ హౌస్

బండ్లగూడ చెరువుకు గండి