హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం

హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం

హైదరాబాద్ లో శుక్రవారం అర్ధరాత్రి  ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుముల, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. గాలి వానకు చాలా ప్రాంతాల్లో చెట్ల నేలకొరిగాయి. భారీ వర్షానికి సిటీలోని చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి మొదలైన వర్షం… ఇవాళ ఉదయం కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కురుస్తూనే ఉంది. అయితే పగలంతా తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులు వర్షంతో సేద తీరారు.

మరోవైపు నాలుగైదు రోజుల్లో తెలంగాణకు నైరుతీ రుతుపవనాలు చేరుకుంటాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.తమిళనాడు, ఏపీ మీదుగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.