ఎమ్మెల్యే కనిపిస్తే నమస్తే పెట్టవా.. యువకుడిపై దాడి

ఎమ్మెల్యే కనిపిస్తే నమస్తే పెట్టవా.. యువకుడిపై దాడి

హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఛార్మినార్ బస్ డిపో సమీపంలో యువకుడి పై ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖన్‌ దాడి చేశారు. ఎమ్మెల్యే కనిపిస్తే నమస్తే పెట్టలేదు అంటూ ముంతాజ్ ఖాన్ హంగామా క్రియేట్ చేశారు. అర్ధ రాత్రి 12 గంటలకు గల్లీలో కూర్చున్న యువకుడు జిలాని పై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్. దీంతో ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడిపై హుస్సేని అలం పీఎస్ లో జిలాని ఫిర్యాదు చేశారు. ఎడమ చెవు దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఎడమ చెవి దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై కేసు నమోదు చేయలేదు హుసేని అలం పోలీసులు. అయితే.. ఈ ఘటన Cctv లో రికార్డ్ అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.