బీజేపీ నాయకులు బ్లాక్ మెయిలర్స్

బీజేపీ నాయకులు బ్లాక్ మెయిలర్స్

బీజేపీ నాయకులు బ్లాక్ మెయిలర్స్ అని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమిత్ షా గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా..?అని ప్రశ్నించారు. మీ బోగస్ మాటలు ఎవరూ నమ్మరని అన్నారు. ఉపాధి హామీకి నిధులు తగ్గించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నీచమైన కుట్రలతో రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఎగనామం పెడుతుందన్నారు. గిరిజన యూనివర్సిటీ, సైనిక్ స్కూల్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూములిచ్చినా , పనులు చేయలేదన్నారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. బండి సంజయ్ బోగస్ మాటలను కరీంనగర్ ప్రజలు నమ్మరన్నారు.  పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు.కేసీఆర్ ది త్యాగాల కుటుంబమన్నారు. 

ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటాలు తేవడంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విఫలమయ్యారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేయాలన్నారు. కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు. అబద్దాల యూనివర్సిటీకి అమిత్ షా వీసీ అని అన్నారు.