ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తాం: మంత్రి తలసాని

ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తాం: మంత్రి తలసాని

హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాల కోసం 30 శాతం సబ్సిడీ నగదు చెల్లించిన వారికి ముఖ్యమంత్రితో చర్చించి తిరిగి చెల్లిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  బషీర్ బాగ్ లోని పూల్ బాగ్ బస్తీలో జవహర్ లాల్ నెహ్రు నేషనల్ అర్బన్ రెన్యూల్ మిషన్ కింద నిర్మించిన ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ , జిహెచ్ఎంసి , హౌసింగ్ బోర్డ్ శాఖల అధికారులతో కలిసి మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి మధ్యలో వదిలేసిన ఇళ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు . 608 మంది లబ్ధిదారులకు ఇళ్ళను నిర్మించామని , మరో 15 రోజుల్లోగా వారికి ఆ ఇళ్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తరువాత ప్రభుత్వం నుండి వచ్చే అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని మంత్రి అన్నారు.