జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఇద్దరు మైనర్లు కార్డు నడిపి యాక్సిడెంట్లు చేశారు. బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లోని వెంగల్‌రావు పార్క్ సమీపంలో క్రెటా కారు అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ కారును ఇంటర్ విద్యార్థి అమన్ సిద్ధార్థ్(17) నడిపినట్లు తేలింది. అతనితో పాటు నలుగురు స్టూడెంట్స్ కారులో ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నంబర్36లోని పెద్దమ్మ తల్లి ఆలయం సమీపంలో ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. మున్నా షా అనే వ్యక్తి తన 17 ఏళ్ల కొడుకు మహ్మద్ సఫీ షా కారు తీసుకెళ్లినట్లు తెలిపాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
