వలసవాదులు అన్నందుకే ఆవేదనతోనే రాజీనామా చేశానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. తమను వలసవాదులు అన్నవాళ్లు కూడా బయటి నుంచి వచ్చిన వాళ్లేనని కామెంట్ చేశారు. ఇగోలు పక్కన పెట్టి అందరు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. తాను రేవంత్ మనిషిని అయితే సీఎల్పీ నేత చెప్పిన పనులు చేయలేదా అని సీతక్క ప్రశ్నించారు. వలస వాదులని అనకుండా తమ పనితీరుపై మాట్లాడాలన్నారు. పార్టీ ఏది చెబితే అది చేస్తానన్నారు. ఏమైనా తప్పు చేస్తే తనపై కఠిన చర్యలు తీసుకోవాలి కానీ పదే పదే వలసవాదులని అనొద్దని అన్నారు.
దిగ్విజయ్ సింగ్ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో సమస్యలన్నీ సెట్ అవుతాయన్నారు. దిగ్విజయ్ సింగ్ తో మాట్లాడిన అంశాలను మీడియాకు చెప్పలేనన్నారు. తాము నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలమని...తమ దగ్గర టీడీపీ ప్రస్తావన అనవసరమని ఆమె అన్నారు.
