మొబైల్స్​లో షోరూంల హవా!

మొబైల్స్​లో షోరూంల హవా!

ఆన్​లైన్​ సంస్థల రాకతో దెబ్బతిన్న ఆఫ్​లైన్​ మార్కెట్ జోరందుకుంది. దేశవ్యాప్తంగా చిన్న చిన్న సంస్థలను దెబ్బ తీస్తున్న పెద్ద కంపెనీలకు కేంద్రం కళ్లెం వేయడంతో, గతేడాది కాలంగా షోరూం బిజినెస్​ మళ్లీ గాడిలో పడింది. అయితే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లో అమ్మకాలతో వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత మార్కెట్ ఎలా ఉందనే అంశాలను ప్రముఖ రిటైల్ రంగ సంస్థ సెల్ బే మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ సీఈవో సోమ నాగరాజు పలు  విషయాలను వెలుగుతో పంచుకున్నారు.  – హైదరాబాద్, వెలుగు

వెలుగు : ఆఫ్​లైన్​ మొబైల్ బిజినెస్ ఎలా ఉంది?

నాగరాజు : ఈ–కామర్స్‌‌‌‌ సంస్థల ముప్పెట దాడితో రిటైల్ ఆఫ్ల లైన్ బిజినెస్ గత కొన్నేళ్లుగా ప్రభావం చూపింది. కానీ ప్రభుత్వాలు తీసుకున్న నియంత్రణ చర్యలతో ఆఫ్​లైన్​ మార్కెట్ శరవేగంగా పుంజుకుంటుంది. ఒకప్పటి లాగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లో బుక్ చేసుకునే అలవాటు నుంచి ఆఫ్​లైన్​ స్టోర్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

తెలంగాణలో సెల్ బే వ్యాపారం ఎలా సాగుతోంది ?

నాగరాజు : కంపెనీ ప్రారంభించిన రెండేళ్లలోనే ఇతర రిటైల్ కంపెనీలను తలదన్నేలా 72 ఆఫ్​లైన్​ స్టోర్లను తెలంగాణ వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయగలిగాం. తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా… ఇప్పుడు గాడిలో పడింది.  బిజినెస్  వేగం పుంజుకుంది.  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కంపెనీల పోటీ ఉన్న… గతేడాది రూ. 110 కోట్ల టర్నోవర్‌‌‌‌ను సునాయాసంగా చేరుకోగలిగాం.

తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ మార్కెట్ ఎలా ఉంది..?

నాగరాజు: ప్రస్తుతానికి ప్రతి నెల 14 వేల మొబైళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి.  ఇప్పుడిప్పుడే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ నుంచి షోరూంల​ వైపు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. 2025 నాటికి ఏటా 90 లక్షల స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతాయి.   మొబైల్ ఆఫ్​లైన్​ మార్కెట్‌‌‌‌కు  ఆదరణ  పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి మా సంస్థలో 280 మంది వివిధ హోదాల్లో ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా ఉద్యోగాలు దొరుకుతాయి.

ఆఫ్​ లైన్​లో కొనుగోలు పెరగడానికి కారణాలేంటి…?

నాగరాజు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కొనుగోళ్లతో కస్టమర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఆఫ్​లైన్​ మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడుతున్నాయి. దాంతోపాటు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ధరకే ఆఫ్​ లైన్​లో దొరకడంతోపాటు, వారంటీ గ్యారంటీ, ఫిజికల్ డ్యామేజీకి ఆస్కారం లేని ప్రొడక్ట్ ను కొనుగోళ్లు పెరగడానికి కారణాలు. ముఖ్యంగా ప్రొడక్ట్ డ్యామేజీ అయితే వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది. దీంతో స్టోర్ లో నేరుగా చూసి ప్రొడక్ట్ ను చూసి కొంటున్నారు.

ప్రొడక్ట్ వారంటీలో ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి ?

నాగరాజు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లో మొబైల్ కొనడం వలన డ్యామేజ్‌‌‌‌ అయిన సందర్భంలో చాలా ఇబ్బందిపడాల్సి వస్తోంది. వారంటీ వర్తించాలంటే డీఓఏ సర్టిఫికేట్ ఉండాలి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లో కేవలం ఇన్ వాయిస్ రిసీట్ మాత్రమే వస్తుంది. ప్రొడక్ట్ డ్యామేజ్ అయిన సందర్భంలో సంబంధిత ఈ–కామర్స్‌‌‌‌ వెబ్ సైట్లను ఆశ్రయిస్తే గానీ ఆ సర్టిఫికెట్ రాదు. ఈ కారణంగా కొనుగోలు సులభంగా ఉన్నా.. ఆ తర్వాత ఇబ్బందులు తప్పవు. ఈ సర్టిఫికెట్ లేనిదే సర్వీస్ సెంటర్ లో అనుమతించరు. కానీ సెల్ బే స్టోర్ లో రూ.నాలుగు వేల ఫోన్ కొనుగోలు చేసిన రూ.850 విలువ చేసే వారంటీని ఉచితంగానే ఇస్తున్నాం. ఒకవేళ డ్యామేజ్ జరిగినాస్టోర్ సిబ్బందియే స్వయంగా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లేలా స్లాట్ బుకింగ్ చేసి వారంటీ సర్వీస్ అందేలా చొరవ తీసుకుంటాం.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌, ఆఫ్​లైన్​ ధరల్లో తేడా ఎందుకు ? నాగరాజు: ఇది అవాస్తవం. గతేడాది కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరల్లో వ్యత్యాసం లేదు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లోనే దొరికే ధరకే ఇప్పుడు ఆఫ్​లైన్​ స్టోర్ లోనూ లభిస్తున్నాయి.  సెల్లింగ్​ ఎక్కువగా ఉన్న రియల్ మీ, రెడ్ మీ, ఒప్పొ, వన్ ప్లస్ వంటి కంపెనీలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌, ఆఫ్​ లైన్​లోనూ ఒకే ధరకు అమ్మాలనే నిబంధన తెచ్చాయి. ఒకప్పుడు ఈ–కామర్స్‌‌‌‌ సంస్థలకే పరిమితమైన కంపెనీలు కూడా ఇప్పుడు ఆఫ్​లైన్​ స్టోర్ల ఏర్పాటు చేస్తున్నాయి. అదే విధంగా ప్రతి ప్రొడక్ట్ పై మ్యాగ్జిమమ్ ఆపరేటింగ్ ప్రైస్ నిర్ణయించాయి.  దీంతో ఆఫ్​లైన్​ కానీ, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లో కానీ ధరల్లో తేడాలు ఉండవు.

ఏ సెగ్మెంట్ లో ఎక్కువగా సేల్స్ ఉంటున్నాయి…

నాగరాజు: రూరల్ నుంచి అర్బన్ వరకు ప్రస్తుతానికి 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్న ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హై ఎండ్ లో 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కంపెనీ ఏదైనా అన్ని మొబైళ్లలో క్వాల్‌‌‌‌కామ్‌‌‌‌ ప్రాసెసర్ ఉండటంతో, వినియోగదారుడు కొనేముందు చూడాల్సింది కెమెరా, బ్రాండ్, ర్యామ్ సెగ్మెంట్, ఫిజికల్ ఫీల్​ను! ఇవి బాగుంటే చాలు.

మొబైల్ ఫైనాన్స్ ఎలాంటి ప్రభావం చూపుతుంది.?

నాగరాజు: ఆఫ్​లైన్​ మొబైల్ మార్కెట్‌‌‌‌కు ఫైనాన్స్ కలిసి వచ్చిన అంశం. ప్రస్తుతం 12కుపైగా బ్యాంకింగ్, ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు మొబైల్ ఫైనాన్స్ సేవలు అందిస్తున్నాయి. అదే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ లో క్రెడిట్, డెబిట్ కార్డులపై మాత్రమే ఫైనాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. తమ స్టోర్లలో నాలుగు సంస్థల ఫైనాన్స్ సౌకర్యాన్ని కలిగిస్తున్నాం. దీంతో కూడా ఆఫ్​లైన్​ల స్టోర్లకు వైపు కస్టమర్లు వస్తున్నారు.

ఆఫ్​లైన్​ స్టోర్లలో ఏఏ ప్రొడక్టులు ఉన్నాయి.? ట్యాబ్లెట్ల మార్కెట్ ఎలా ఉంది.?

నాగరాజు: ఒకప్పుడు మొబైళ్లకు, ట్యాబ్లెట్లకు ఒకే రీతిలో డిమాండ్ ఉండేవి. కానీ ప్రస్తుతం ట్యాబ్లెట్లకు  మార్కెట్ లేదు. యాపిల్ లాంటి పెద్ద పెద్ద ప్రొడక్టులు ఇందుకు మినహాయింపు. చాలా కంపెనీలు వీటి ప్రొడక్షన్ నిలిపివేశాయి. ప్రస్తుతం ఆఫ్​లైన్​ స్టోర్లలో దొరుకుతున్నా ఆండ్రాయిడ్ టీవీలకు గిరాకీ బాగా పెరిగింది. సెల్ బేలో ప్రస్తుతం ఎంఐ ఉత్పత్తులన్నీ దొరుకుతాయి. ఆండ్రాయిడ్ టీవీ, ట్రిమ్మర్, ట్రాలీ సూట్ కేసులతో సహా యాక్సెసరీస్ లను అమ్ముతున్నాం. రూ.12 వేల్లోనే స్మార్ట్ టీవీలు దొరుకుతుండటంతో ఆఫ్​లైన్​ స్టోర్లలో నేరుగా చూసి కొంటున్నారు.