లాక్ డౌన్ సరిగ్గా అమలు చేయట్లే..ఓల్డ్ సిటీలో పరిస్థితి దారుణం

లాక్ డౌన్ సరిగ్గా అమలు చేయట్లే..ఓల్డ్ సిటీలో పరిస్థితి దారుణం

హైదరాబాద్, కొత్తపల్లి, కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: కరోనా నియంత్రణ విషయంలో తెలంగాణ సర్కార్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సెంట్రల్ టీంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. టెస్టులు చేయడం లేదని, లాక్ డౌన్​ను సరిగ్గా అమలు చేయడంలేదని, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ లో కరోనా కంట్రోల్ కోసం రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలు తెలుసుకోవడంతోపాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఐదు రోజుల కిందట కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బృందం రాష్ట్రానికి వచ్చింది. ప్రభుత్వ చర్యలపై అసంతృప్తితో ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు రెండు, మూడు రోజుల నుంచి సెంట్రల్ టీంను కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు కేంద్ర బృందం నిరాకరించింది. చివరికి సంజయ్ గురువారం వీడియో కాల్ ద్వారా ఆ టీమ్​తో మాట్లాడారు. ఈయనతోపాటు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, రాష్ట్ర బీజేపీ డాక్టర్స్ సెల్ కు చెందిన కొందరు డాక్టర్లు కూడా మాట్లాడినట్లు తెలిసింది.

రేవంత్.. ఆధారాలున్నయా?

రాష్ట్ర మంత్రి కేటీఆర్ బావమరిదికి సంబంధించిన కంపెనీతో కేంద్రం ఒప్పందం చేసుకుందని, దీనిపై బీజేపీ రాష్ట్ర నేతలు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన డిమాండ్ పై బండి సంజయ్ స్పందించారు. రేవంత్ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తమకు సమర్పిస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అవినీతిపై ఆధారాలను బీజేపీ రాష్ట్ర నేతలకు అందజేయాలని లేదా కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ
జరిపిస్తామని తెలిపారు. అవినీతి ఆరోపణలతో కూరుకుపోయిన టీఆర్ఎస్​తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

ప్రభుత్వం తీరుతోనే రైతులకు ఇక్కట్లు

రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట, మానకొండూర్​ మండలం ఖాదర్​గూడెంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటలను ఆయన పరిశీలించారు. పంటను కేంద్రం కొంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని.. బ్రహ్మాండంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రులు ఒక్కోచోట ఒక్కోరకంగా మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రార్థనల పేరుతో ఓ వర్గం ప్రజలు లాక్​డౌన్​ను ఉల్లంఘిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వర్గానికే కొమ్ము కాస్తోందని బండి సంజయ్​మండిపడ్డారు. ఓల్డ్ సిటీ, తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న లాక్​డౌన్ ఉల్లంఘనలు కుహనా రాజకీయ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో లక్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే తెలంగాణలో 25 వేల మందికే చేశారని, పరీక్షలు ఎక్కువ మందికి చేస్తే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమిటని ప్రశ్నించారు. సంజయ్​తోపాటు బీజేపీ నేతలు బాస సత్యనారాయణ, తాళ్లపల్లి శ్రీనివాస్​గౌడ్, కడార్ల రతన్‌కుమార్ తదితరులు ఉన్నారు. మరోవైపు పారమిత విద్యాసంస్థల అధినేత ప్రసాద్ రావు రూ. 2 లక్షలు, భారత్ మాతాకి జై స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రాంబాబు, గుండి రాములు రూ.1,16,000 చెక్కులను ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా సంజయ్​కు అందజేశారు.

వివరాలు దాస్తున్నరు

గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అక్కడి నుంచి రిపోర్టులు తెప్పించుకోవాలని సెంట్రల్ టీంకు సంజయ్ సూచించారు. కరోనా తీవ్రంగా వ్యాపించిన గద్వాల, వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లో టెస్టులు చేయడం పూర్తిగా నిలిపివేశారని ఫిర్యాదు చేశారు. కరోనాతో చనిపోయిన వారి వివరాలను దాస్తున్నారని, వారి డెడ్ బాడీల నుంచి శాంపిల్స్ తీసుకోవడం లేదని వివరించారు. డాక్టర్లకు పీపీఈ కిట్స్ కొరత తీవ్రంగా ఉందని, వారికి కిట్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిం