ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ రేసును తేల్చే అత్యంత కీలకమైన మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికైంది. రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేఆఫ్స్ భవిష్యత్తును శాసించే ఈ బిగ్ ఫైట్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ (MI) మొదట ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌కు ‘డూ ఆర్ డై’ లాంటిది. ఇందులో గెలిస్తే డైరెక్టుగా రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు కూడా ఈ మ్యాచ్ ఫలితం పైనే ఆధారపడి ఉండటంతో ఈ కీలక పోరుపై ప్రాధాన్యత సంతరించుకుంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేస్తాం.. ఈ పిచ్ చూడటానికి చాలా బాగుంది, సాయంత్రం అయ్యేసరికి బ్యాటింగ్‌కు మరింత అనుకూలిస్తుంది.. ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైనది, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 29 లక్షల మందికి పైగా సహాయం అందింది.. ఈ రోజు జస్సి (బుమ్రా)కి రెస్ట్ ఇచ్చాం, దీపక్ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్ మాకు కష్టంగా సాగింది, కానీ విజయంతో ముగించాలనుకుంటున్నామని పాండ్యా వెల్లడించాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. మేము కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం.. ఇది మాకు టోర్నమెంట్‌లో చివరి మ్యాచ్ కావచ్చు, అందుకే మా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మేము నేరుగా క్వాలిఫై అవుతాం, ఇక ఇతరుల ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.. జట్టులోకి నాండ్రే, జడేజా, నేను (రియాన్ పరాగ్).. ఇలా మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నామని పరాగ్ పేర్కొన్నాడు.
ఇరు జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, యశ్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, AM గజన్‌ఫర్, రఘు శర్మ
🚨 Toss update from Mumbai 🚨@mipaltan won the toss and elected to bowl first against @rajasthanroyals
— IndianPremierLeague (@IPL) May 24, 2026
Updates ▶️ https://t.co/h2ze7K0gd6#TATAIPL | #KhelBindaas | #MIvRR pic.twitter.com/CStsvZbcuO
