‘కస్టడీ’ చివరి షెడ్యూల్ ప్రారంభం

‘కస్టడీ’ చివరి షెడ్యూల్ ప్రారంభం

నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దీన్ని రూపొందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్‌‌ని శుక్రవారం ప్రారంభించారు మేకర్స్. లీడ్ యాక్టర్స్‌‌ అంతా పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌‌లో  కొన్ని కీలక సన్నివేశాలను తీస్తున్నారు.  దీంతో షూట్ మొత్తం పూర్తవుతుంది.

ఇందులో  చైతూ ఫెరోషియస్ గెటప్‌‌లో  కనిపించనున్నాడు. న్యూ ఇయర్‌‌‌‌కి విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది.  ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌లో అరవింద్ స్వామి విలన్‌‌గా నటిస్తున్నారు. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తుండటం విశేషం.  మే 12న సినిమా విడుదల కానుంది.