గ్యాంగ్ లీడర్ 4k క్వాలిటీలో పైరసీకి కారణం అమెజాన్ ప్రైమేనా?

గ్యాంగ్ లీడర్ 4k క్వాలిటీలో పైరసీకి కారణం అమెజాన్ ప్రైమేనా?

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా పైరసీకి గురైంది. మెగాస్టార్ మూవీ టైటిల్ ‘గ్యాంగ్ లీడర్’ తో గత నెల సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా ‘ఆ లీడర్’ అంతా హిట్టు కొట్టలేకపోయింది. జస్ట్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా కాకముందే ‘అమెజాన్ ప్రైమ్’ లోకి వచ్చేసింది. నిబంధనల ప్రకారమైతే ఏ సినిమా అయినా సరే.. హిట్టు, ఫట్టు తో సంబంధం లేకుండా కనీసం రెండు నెలలు గడిచిన తర్వాతనే డిజిటల్ ఫ్లాట్ ఫాం లోకి వెళ్లాలి. మరీ ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, అమెజాన్ మధ్య ఏం అగ్రిమెంట్ జరిగిందో కానీ గురువారం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో దర్శనమిచ్చింది.

విడుదలై నెల కూడా గడవకముందే సినిమాను ఆన్ లైన్ లో పెట్టడంతో నాని అభిమానులతోపాటు, సగటు ప్రేక్షకులు కూడా మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆ చిత్ర నిర్మాతల్ని, అమెజాన్ ప్రైమ్ ను తిడుతూ కామెంట్లు పెట్టారు. ఈ వ్యతిరేకత చూసి ప్రైమ్ లో పెట్టిన కొద్ది సేపటికే సినిమాను అందులోంచి తీసేశారు.  కానీ ఆ లోపే జరిగాల్సిన నష్టం జరిగిపోయింది. పైరసీ రాయుళ్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ‘గ్యాంగ్ లీడర్’ ను పైరసీ చేసి తమ వెబ్ సైట్ లో పెట్టారు. తమ అభిమాన హీరో సినిమా 4కే రెజోల్యూషన్ తో ఆన్ లైన్ దర్శనమివ్వడంతో ఇందుకు కారణం అమెజాన్ ప్రైమే నని అంటున్నారు.

Nani's Gang Leader movie is pirated. reason is Amazon Prime?