జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయకుడు శివమొగ సుబ్బన్న (83) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్(బెంగుళూరు)లో సుబ్బన్న అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న రాత్రి ఆయనకు గుండె పోటు రావడంతో మృతిచెందారు. 1978లో వచ్చిన 'కాదు కుద్రే ఒడి బండిట్టా' అనే పాటకు సుబ్బన్నకు జాతీయ అవార్డు లభించింది. శివమొగకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థీవదేహాన్ని బెంగుళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో ఉంచనున్నారు.
1938లో శివమొగ్గ జిల్లాలో జన్మించిన శివమొగ సుబ్బన్న... ఇప్పటి వరకూ వేలాది పాటలను పాడి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన సీని పరిశ్రమకు రాక ముందు జి. సుబ్రమణ్యంగా పిలిచే వారు. ఆ తర్వాత అభిమానులు ఆయనను శివమొగ సుబ్బన్న అని ప్రేమతో పిలవడం మొదలుపెట్టారు. శాస్త్రీయ సంగీతంలో ఎనలేని పట్టును సంపాదించుకున్న శివమొగ.. కొంతకాలం న్యాయవాదిగా కూడా పని చేశారు. అయితే సంగీతంపై ఉన్న ప్రేమతోనే ఆయన న్యాయవాది వృత్తిని వదిలేశారు. కన్నడ భాషలోనే కాకుండా చాలా భాషాల్లోనూ సుబ్బన్న తన గొంతును వినిపించి చిత్ర ప్రపంపంచంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

