నవాజ్ షరీఫ్ ప్రజలను ఫూల్స్ గా భావిస్తున్నారు

నవాజ్ షరీఫ్ ప్రజలను ఫూల్స్ గా భావిస్తున్నారు

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను తిరిగి స్వదేశానికి రప్పించాలని అధికార తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ మెంబర్స్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నవాజ్ షరీఫ్ హెల్త్ కండీషన్ పై ఈమధ్య కొన్ని రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో లండన్ లోని ఓ కేఫ్ లో తన ఫ్యామిలీతో కలసి నవాజ్ షరీఫ్ టీ తాగుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో రోడ్ సైడ్ కేఫ్ లో తన మనుమరాళ్లతో కలసి కూర్చున్న షరీఫ్..​ బ్లూ షల్వార్ కమీజ్, క్యాప్ తో చాలా హెల్తీగా కనిపించారు . దీనిపై కొందరు పాక్ మినిస్టర్స్ స్పందించారు. షరీఫ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని ఒకవైపు పుకార్లు వస్తున్నా.. మరోవైపు కరోనా భయపెడుతున్న ఈ టైమ్ లో ఆయన లండన్ వీధుల్లో మాస్కు కూడా కట్టుకోకుండా తిరుగుతున్నారని వారు విమర్శిస్తున్నారు.

‘కేఫ్ లో టీ తాగుతున్న షరీఫ్ ఫొటో మా దేశ చట్టాలు, న్యాయ వ్యవస్థను బహిర్గతం చేస్తోంది. అలాగే జవాబుదారీ వ్యవస్థను ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో కూడా స్పష్టం చేస్తోంది. అని పాక్ సైన్స్ మినిస్టర్ ఫవాద్ చౌధరీ తెలిపారు. ‘షరీఫ్​ ప్రజలను ఫూల్స్ గా భావిస్తున్నార’ని పీఎం అడ్వైజర్ షాబాజ్ గిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఫొటోను తన నాన్న శత్రువులు కావాలనే లీక్ చేశారని షరీఫ్ కూతురు మర్యం నవాజ్ ఆరోపించారు. ఈ ఫొటో చూసి షరీఫ్ మద్దతుదారులు సంతోషించారని, కానీ ఆయన శత్రువులు దీని నుంచి చాలా నేర్చుకోవాలని ఆమె పేర్కొంది. షరీఫ్ రోగ నిరోధక వ్యవస్థ రుగ్మతతో బాధపడుతున్నారు. అలాగే కొరోనరీ డిసీజ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయనను విదేశాల్లో ట్రీట్ మెంట్ చేయించుకోవాల్సిందిగా గవర్నమెంట్స్ ప్లానెల్ డాక్టర్స్ సూచించారు. షరీఫ్ కు కార్డియాక్ సర్జరీ జరగాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సర్జరీ వాయిదా పడింది.