V6 News

కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో.. కార్గిల్ విజయ్ దివస్

కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో.. కార్గిల్ విజయ్ దివస్
  • అమరులకు నివాళులర్పించిన ఎన్​సీసీ స్టూడెంట్లు
  • జాతీయ జెండాలతో ర్యాలీ 

ముషీరాబాద్, వెలుగు: బాగ్​లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో బుధవారం కార్గిల్ విజయ్ దివస్ను  నిర్వహించారు. అమరులైన సైనికులకు చెందిన ఎన్​సీసీ స్టూడెంట్లు నివాళులర్పించారు. 

సైనిక అమరవీరులను సర్మించుకుంటూ, నినాదాలు చేస్తూ అంబేద్కర్ కాలేజీ నుంచి సుందరయ్య పార్కు వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు, ఎన్ సీసీ సీటీవో అధికారి, ప్రినిపాల్స్, ఫ్యాకల్టీ పాల్గొన్నారు.