తీవ్రమైన డైటింగ్ లేదా కఠినమైన నియమాలు లేకుండా బరువు తగ్గడం నిజంగా సాధ్యమేనా.. ? ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణులు సూచించిన ప్రకారం ఈ 4-దశల పద్ధతులు చాల ఆచరణాత్మకమైనది ఇంకా దీర్ఘకాలిక ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అనుమానాలు, ఆందోళనలకు గురిచేసే ఆన్‌లైన్ సలహాల కంటే, నిజ జీవితానికి సరిపోయే ఈ ప్లాన్ వివరాలు మీకోసం...
1. పోషణ (Nutrition): మీరు తినే ఆహారాన్ని పూర్తిగా మార్చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ ప్రస్తుత అలవాట్లకు చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. ఇందుకు కేలరీల నియంత్రణ అంటే మీ శరీర బరువును నిలకడగా ఉంచే కేలరీల కంటే 500 కేలరీలు తక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ ప్రాముఖ్యత అంటే కండరాల పుష్టి కోసం ప్రతి పౌండ్ శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అందేలా చూసుకోండి. మీకు నచ్చిన 5 నుండి 10 రకాల ఆరోగ్యకరమైన వంటకాలను రెడీ చేసుకొని, వాటినే మార్చి మార్చి తీసుకోవడం వల్ల గందరగోళం ఉండదు. బయట తినేటప్పుడు ఆవేశంగా నిర్ణయం తీసుకోకుండా, తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని ముందే నిర్ణయించుకోండి.
2. వ్యాయామం : జిమ్‌లోనే గంటల తరబడి గడపాల్సిన అవసరం లేదు. వృత్తిపరమైన బాధ్యతలు ఉన్నవారు కూడా చేయగలిగేలా ఉండాలి. కాబట్టి కేవలం వారానికి మూడు లేదా నాలుగు సార్లు జిమ్‌కు వెళ్లినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అది కూడా 45 నుండి 60 నిమిషాలు ఉంటే సరిపోతుంది. గత వారం కంటే ఈ వారం కాస్త ఎక్కువ బరువు ఎత్తడం లేదా ఎక్కువ రిపిటీషన్లు చేయడం ద్వారా శరీర సామర్థ్యాన్ని పెంచండి. మీ వీలును బట్టి అప్పర్ బాడీ, లోయర్ బాడీ ఇలా వ్యాయామాలు చేయండి.
3. శారీరక కదలిక:
వ్యాయామం ఒక్కటే కాదు, రోజంతా మీరు చేసే కదలికలు కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజూ కనీసం 10,000 అడుగులు నడవడాన్ని టార్గెట్ పెట్టుకోండి. ఇలా చేస్తే రోజుకు సుమారు 400-500 అదనపు కేలరీలను ఖర్చు చేస్తుంది. వారానికి రెండు మూడు సార్లు 20 నుండి 40 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా కార్డియో చేయడం మంచిది. ఇంకా మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు లేదా ఖాళీ సమయాల్లో నడవడం అలవాటు చేసుకోండి.
►ALSO READ | జీవిత సత్యం: నిజమైన ప్రేమ అంటే ఏమిటి.. ఎవరు ఎలా ఉంటారు..
4. నిద్ర: అత్యంత కీలకమైన అంశం ఏటంటే చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తారు, కానీ నిద్ర మీ డైట్‌ను పూర్తిగా నాశనం చేస్తుంది. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఆకలిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి, దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారంపై కోరిక పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ 7 నుండి 8 గంటల గాఢ నిద్ర అవసరం. పడుకోవడానికి 30 నిమిషాల ముందే ఫోన్లు, టీవీలు పక్కన పెట్టేయాలి. అలాగే నిద్రకు 2 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి.
ఈ పద్ధతిని పాటిస్తే మార్పులు ఎలా ఉంటాయంటే:
1వ నెల: సుమారు 2-4 కిలోల బరువు తగ్గుతారు. శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది, కానీ మార్పు నెమ్మదిగా ఉన్నట్లు అనిపించి చాలామంది ఇక్కడే ఆపేస్తారు. మీరు ఆలా చేయకండి.
3వ నెల: 7-11 కిలోల బరువు తగ్గుతారు. బట్టలు వదులుగా మారుతాయి, ఇతరులు మీలో మార్పును గమనిస్తారు.
6వ నెల: 14-23 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు మీకు అలవాటుగా మారిపోతాయి.
1 సంవత్సరం: మీరు కొత్త మనిషిలా కనిపిస్తారు. బరువు తగ్గడం అనేది ఒక పనిలా కాకుండా మీ జీవనశైలిలో భాగమైపోతుంది. పండుగలు, ప్రయాణాలు వచ్చినా మీ బరువు కంట్రోల్లోనే ఉంటుంది.
వయసు పెరుగుతున్నా దృఢంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఈ నాలుగు సూత్రాలను పాటించడం అత్యంత సులభమైన, సరైన మార్గం.

