నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 23న ప్రారంభమై మే 7న ముగుస్తుంది.
పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్).
మొత్తం పోస్టులు: 250. (అన్ రిజర్వ్డ్ 109, ఈడబ్ల్యూఎస్ 25, ఓబీసీ 39, ఎస్సీ 42, ఎస్టీ 35).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 40 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 23.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు
ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 7.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్/ స్క్రీనింగ్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ careers.ntpc.co.inను సందర్శించండి.

