సెకండ్ ప్లేస్ లో నీరజ్‌ చోప్రా

సెకండ్ ప్లేస్ లో నీరజ్‌ చోప్రా

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌‌లో గోల్డ్‌‌ మెడల్‌‌ సాధించిన ఇండియన్‌‌ స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా.. ఇంటర్నేషనల్‌‌ ర్యాంకింగ్‌‌ను కూడా గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు. వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌ ఫెడరేషన్‌‌ గురువారం విడుదల చేసిన జాబితాలో 14 స్థానాలు మెరుగుపడి రెండో ర్యాంక్‌‌లో నిలిచాడు. ప్రస్తుతం నీరజ్​ ఖాతాలో 1315 పాయింట్లు ఉన్నాయి. జర్మనీ అథ్లెట్‌‌ జొహన్నాస్‌‌ వెటెర్‌‌ (1396) టాప్‌‌ ప్లేస్‌‌లో కొనసాగుతున్నాడు. ఇక ఒలింపిక్స్‌‌లో నీరజ్‌‌ చూపెట్టిన పెర్ఫామెన్స్‌‌.. టోక్యో ట్రాక్‌‌ అండ్‌‌ ఫీల్డ్‌‌లో చోటు చేసుకున్న పది అద్భుతాల్లో ఒకటిగా నిలిచింది. గేమ్స్‌‌లో మెడల్‌‌ గెలవకముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని నీరజ్‌‌.. ఇప్పుడు అందరికి హీరో అయిపోయాడు. ఇంటర్నెట్‌‌లో అతని వివరాలు తెలుసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.