న్యూజీలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి.. 20 మందికి తీవ్రగాయాలు

న్యూజీలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి.. 20 మందికి తీవ్రగాయాలు

న్యూజీలాండ్ లో దుండగులు భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించారు. క్రైస్ట్ చర్చ్ నగరంలోని అల్ నూర్, లిన్ వుడ్ మసీదుల్లో మారణహోమం సృష్టించారు. పదుల సంఖ్యలో ఆగంతకులు గన్స్ తో కాలుస్తూ.. బాంబులు విసురుతూ చేసిన దాడిలో… భారీస్థాయిలో ప్రాణనష్టం జరిగింది. మొత్తం 40 మంది చనిపోయినట్టు న్యూజీలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డర్న్ ప్రకటించారు. దుండగుల కాల్పుల్లో మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు.

క్రైస్ట్ చర్చ్ లో దుండగుల కాల్పులు న్యూజీలాండ్ చరిత్రలోనే అత్యంత దుర్దినాల్లో ఒకటని ఆమె చెప్పారు. ఇటువంటి హింస గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు. తమకు పౌరులంతా సమానమే అనీ… సిటీలో అవసరమైనంత పోలీస్ ప్రొటెక్షన్ ఉందని… ప్రజలు భయాందోళనకు లోనుకావొద్దని చెప్పారు.

కాల్పులపై న్యూజీలాండ్ పోలీసులు హై అలర్టయ్యారు. అన్ని మసీదులను మూసివేయాలని సూచించారు. అనుమానాస్పదంగా ఎవరు, ఏది కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని హెల్ప్ లైన్ పెట్టారు.