Vijay, Anand: విజయ్ డిటెక్టీవ్.. ఆనంద్ విలన్.. దేవరకొండ బ్రదర్స్ మల్టీస్టారర్

Vijay, Anand: విజయ్ డిటెక్టీవ్.. ఆనంద్ విలన్.. దేవరకొండ బ్రదర్స్ మల్టీస్టారర్

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గం గం గణేష(Gam Gam Ganesha). క్రైం అండ్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కిస్తుండగా.. హైలైఫ్ పతాకంపై కేదార్ జలగంశెట్టి, వంశీ కరుమంచి నిర్మిస్తున్నారు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. 

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండతో మల్టీస్టారర్ సినిమా చేయడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇదే విషయం గురించి ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. అన్నతో మల్టీస్టారర్ చేయడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. చేస్తే బాగానే ఉంటుంది కానీ.. సెట్ లో మా అన్నతో యాక్ట్ చేయాలంటే కొంచెం షేక్ అవుతాను. గతంలో థియేటర్స్ చేస్తున్నప్పుడు.. నేను అన్నా చెక్ మెట్ అనే ఓ నాటకంలో ఆర్టిస్టులుగా చేశాము. అందులో అన్న డిటెక్టివ్ పాత్రలో, నేను విలన్ పాత్రలో నటించాను. కానీ, సినిమాల్లో మల్టీస్టారర్ అంటే దాని గురించి ఇప్పుడు చెప్పలేను.. అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక విజయ్ దేవరకొండ విషయనికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ఈ సినిమాలో మొదటిసారి పోలీస్ రోల్ లో కనిపించనున్నాడు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి.