ఢిల్లీలో హైటెన్షన్.. BJP ఆఫీస్ ముట్టడికి APP ప్రయత్నం

ఢిల్లీలో హైటెన్షన్.. BJP ఆఫీస్ ముట్టడికి APP ప్రయత్నం

దేశ రాజధాని ఢిల్లీ హైటెషన్ వాతావరణం నెలకొంది. బెయిల్ పై వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నేతలు రాజకీయంగా ఎదగనివ్వకుండా బీజేపీ అరెస్ట్ చేయడానికి బీజేపీ ఆపరేషన్ ఝాదూ ప్రారంభించిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 

ఆప్ లీడర్ల బీజేపీకి సవాల్ గా మారుతున్నారని అందుకే ఆపరేషన్‌ ఝాదూతో వాళ్లని అరెస్ట్ చేస్తున్నారని, AAP బ్యాంక్ అకౌంట్లు కూడా త్వరలో ఫ్రీజ్ చేస్తారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఆదివారం ఆయన ఢిల్లీ పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఢిల్లీ బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ నాయకులు ర్యాలీగా బయలుదేరారు.

ఆప్ ఎంపీ పైన సొంత పార్టీ నాయకుడి పీఏనే తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. హజారీ కోర్టు ఆయనకు 5 రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. ఈ అరెస్ట్ కు నిరసనగా ఆప్ ఢిల్లీ బీజేపీ ఆఫీస్ ముందు నిరసన చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ఆమ్ ఆద్మీ నాయకులతో పాటు ఇండియా కూటమి నాయకులు కూడా వస్తున్నారు. 

 ఢిల్లీలోని DDU మార్గ్ లో ఉన్న బీజేపీ హెడ్ ఆఫీస్ ముందు నిరసన తెలపడానికి జైల్‌ భరో మార్చ్ చేస్తున్నారు. మరోవైపు ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.  బీజేపీ ఆఫీస్ వద్ద 144 సెక్షన్ విధించారు. డీడీయూ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయంలో భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు బార్కేట్లు పెట్టి, భారీగా మోహరించారు. ఆప్ నాయకులు ఇప్పుడే ర్యాలీగా రోడ్లపైకి చేరుతున్నారు. వారిని పోలీసులు చెదరగొడుతున్నారు.