ఎంగేజ్‌‌మెంట్ చేసుకుని నితిన్ మోసం చేశాడు

ఎంగేజ్‌‌మెంట్ చేసుకుని నితిన్ మోసం చేశాడు

నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కించిన ‘భీష్మ’ ఇటీవల విడుదలై విజయం సాధించింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. రీసెంట్‌ గా వైజాగ్‌‌లో థ్యాంక్స్‌‌ మీట్ నిర్వహించారు. వరుణ్‌ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లకు , యూనిట్ మెంబర్లకు జ్ఞాపికలను అందజేశారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘చీఫ్ గెస్టులా కాకుండా నా ఫ్రెండ్ నితిన్ సక్సెస్‌‌ని ఎంజాయ్ చెయ్యడానికి వచ్చాను. ఈ సినిమా స్టార్ట్ చెయ్యక ముందు నుంచీ ఒకటిన్నర సంవత్సరంగా నితిన్, నేను కలిసి ట్రావెల్ చేశాం. స్టోరీ నాకు ముందే చెప్పాడు. సాంగ్స్ చూపించాడు. సినిమా హిట్టవ్వా లని కోరుకున్నా. నిజంగా నా సినిమా హిట్టయితే ఎంత హ్యాపీగా ఫీలవుతానో, దానికంటే ఎక్కువగా నితిన్ సినిమా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీలయ్యాను. ఇండస్ట్రీలో సెకండ్ సినిమా హిట్ కొట్టడం కష్టమంటారు. వెంకీ ఆ పరీక్ష పాసయ్యాడు. రష్మిక గ్రేట్ ట్రాక్‌‌లోఉంది. మంచి టాలెంట్ ఉన్న నటి. తనతో చేస్తే సినిమా హిట్టవుతుందంటారు. త్వరలో ఆమెతో కలిసి నటించాలని ఆశిస్తున్నా. నిర్మాత నాగవంశీ ‘అల..వైకుంఠపురములో’తో  పెద్ద సక్సెస్ కొట్టి, ‘భీష్మ’తో కంటిన్యూ చెయ్యడం మామూలు విషయం కాదు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ అభినందనలు. నితిన్ సినిమా అంతా జెన్యూన్‌‌గా తీసి, ఒక విషయంలో మోసం చేశాడు. ‘భీష్మ.. సింగిల్ ఫరెవర్’ అన్నాడు. ఫస్ట్ రీల్ అయ్యేసరికల్లా  ఒకమ్మాయిని పడేశాడు. సింగిల్‌ గా ఉంటానని చెప్పి రిలీజ్‌‌కి ముందే ఎంగేజ్‌‌మెంట్ చేసుకున్నాడు. మమ్మల్ని మోసం చేశాడు. తన విషయంలో హ్యాపీగా ఉన్నా. సినిమా సక్సెస్ కంటే పెద్ద అడుగు పెళ్లి. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు అతనికీ, శాలినికీ అభినందనలు’ అన్నాడు.

నితిన్ మాట్లాడుతూ..‘పవన్ కల్యాణ్ గారు ఆరడుగుల బుల్లెట్ అయితే, మా వరుణ్ ఆరడుగుల నాలుగంగు ళాల బుల్లెట్. ఆయన రాలేకపోయినా వరుణ్ గారు వచ్చారు. ఈ ప్రొడ్యూసర్‌‌‌‌తో నా మొదటి సినిమా ‘అ ఆ’ పెద్ద హిట్టయింది. ఇది రెండో సినిమా. ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నాలుగేళ్ల తర్వాత మళ్లీ హిట్ వచ్చింది. నిర్మాతకు, దర్శకుడికి థ్యాంక్స్. రష్మికతో కాంబినేషన్ హిట్టయింది. ఈ సినిమాలో ఆమె డ్యాన్సులు ‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’ అన్నాడు.

‘భీష్మ’ మంచి సక్సెస్ అయినందుకు సంతో షంగా ఉంది. నితిన్, వెంకీ.. ఇద్దరూ నాకు చాలా ఇష్టం . నాగవంశీ గారు మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నా’ అంది రష్మిక. ఈ సినిమా చేసే చాన్స్ ఇచ్చిన నితిన్‌‌కి , ప్రొడ్యూసర్‌‌‌‌కి థ్యాంక్స్ చెప్పాడు వెంకీ కుడుముల. కాసర్ల శ్యామ్, సంపత్‌‌ రాజ్, అజయ్, ఫైట్ మాస్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.