ఈ ఏడాది కార్లపై డిసెంబర్​ ఆఫర్లు లేవు!

ఈ ఏడాది కార్లపై డిసెంబర్​ ఆఫర్లు లేవు!
ఎస్ యూవీ, సెడాన్, హ్యాచ్ బ్యాక్ అన్నింటికీ.. డీలర్ల వద్ద స్టాక్ లేకపోవడమే కారణం తయారీదారులదీ అదే పరిస్థితి న్యూఢిల్లీ : ఆటోమొబైల్‌‌‌‌ కంపెనీల నుంచి ప్రతీ ఏడాదిలాగే ఈ డిసెంబర్‌‌లోనూ ఆఫర్లు వెల్లువెత్తుతాయనే బయ్యర్ల ఆశలు  నెరవేరలేదు. కార్‌‌ డీలర్ల దగ్గర ఇన్వెంటరీ పెద్దగా లేకపోవడంతోపాటు, ఆటోమొబైల్‌‌ కంపెనీలు మెయింట్‌‌నెన్స్‌‌ కోసం తమ ప్లాంట్స్‌‌ మూసేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కార్లు కొనడానికి సాధారణంగా డిసెంబర్‌‌ మంచి నెల. ఎందుకంటే ఈ నెలలోనే ఎక్కువ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది మాత్రం ఇన్సెంటివ్స్‌‌ ఎస్‌‌యూవీలలో 67 శాతం, సెడాన్స్‌‌లో 61 శాతం, హ్యాచ్‌‌ బ్యాక్‌‌లో 28 శాతం తగ్గాయని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. ఒక్క ఎంపీవీ (మల్టీ పర్పస్‌‌ వెహికల్స్‌‌) సెగ్మెంట్లో మాత్రమే ఇన్సెంటివ్స్‌‌ 11 శాతం పెరిగాయని చెబుతున్నారు. ఆటోమొబైల్‌‌ సెక్టార్‌‌ ధరలను ట్రాక్‌‌ చేసే కంపెనీ  జాటో  ఈ డేటా విడుదల చేసింది. కిందటేడాది డిసెంబర్‌‌లో ఎస్‌‌యూవీలపై రూ. 57,569  ఇన్సెంటివ్స్‌‌ ఇవ్వగా, ఈ ఏడాది ఆ మొత్తం రూ. 19,075 కి పడిపోయింది. ఇక సెడాన్స్‌‌ విషయానికి వస్తే, అంతకు ముందు ఏడాది రూ. 53,154గా ఉన్న ఇన్సెంటివ్స్‌‌ 2020 డిసెంబర్‌‌లో రూ. 20,546 కే పరిమితమయ్యాయి. హ్యాచ్‌‌బ్యాక్‌‌లోనైతే ఇన్సెంటివ్స్‌‌ రూ. 31,840 నుంచి రూ. 22,906కి తగ్గినట్లు జాటో డేటా పేర్కొంది. తగ్గిన సప్లయ్‌‌.. డిసెంబర్‌‌లో డీజిల్‌‌ వెహికల్స్‌‌ సప్లయ్‌‌ తగినంతగా లేదు. పాసింజర్‌‌ వెహికల్స్‌‌ సెగ్మెంట్లో డీజిల్‌‌ వెహికల్స్‌‌ డిమాండ్‌‌కు తగినంతగా సప్లయ్‌‌ లేదు. ఎందుకంటే, ఈ ఏడాది పండగ సీజన్‌‌లో గతంలో కంటే బెటర్‌‌గా పాసింజర్‌‌ వెహికల్స్‌‌ అమ్మకాలు సాగాయి. స్టాక్స్‌‌ ఆధారంగానే సాధారణంగా ఇయర్‌‌ ఎండ్‌‌ ఇన్సెంటివ్స్‌‌ ప్రకటిస్తారు. ఈసారి స్టాక్స్‌‌ తక్కువగా ఉన్నాయి. పాసింజర్‌‌ వెహికల్స్‌‌కు ఈ డిసెంబర్లో రిటెయిల్‌‌ డిమాండ్‌‌ బాగుందని, కానీ సప్లయ్‌‌ లేకపోవడంతో డీలర్స్‌‌కు సేల్స్‌‌ లేవని ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఆటోమొబైల్‌‌ డీలర్స్‌‌ అసోసియేషన్స్‌‌ (ఫాడా) ప్రెసిడెంట్‌‌ వింకేష్‌‌ గులాటి తెలిపారు. కొన్ని పార్ట్‌‌ల సరఫరా సరిగా లేకపోవడం వల్లే డీజిల్‌‌ వెహికల్స్‌‌ సప్లయ్‌‌ లేదని చెప్పారు. డీజిల్‌‌ కాంపొనెంట్స్‌‌ను కొంత మంది వెండర్లే సప్లయ్‌‌ చేస్తారు. వారిలో బాష్‌‌ చాలా పెద్దది. యూరప్‌‌లో రెండో రౌండ్‌‌ లాక్‌‌డౌన్‌‌తో ఆ కంపెనీ ప్రొడక్షన్‌‌కు అంతరాయం కలిగింది. బాష్‌‌కు కొన్ని మాన్యుఫాక్చరింగ్‌‌ ప్లాంట్లు యూరప్‌‌ దేశాలలో ఉన్నాయని మహీంద్రా డీలర్‌‌షిప్‌‌ జేఎస్‌‌ ఫోర్‌‌వీల్‌‌ మోటార్‌‌ ప్రతినిధి నికుంజ్‌‌ సంఘి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎక్కువ డిమాండ్‌‌ ఉండే వెహికల్స్‌‌ పాత ఆర్డర్లను కూడా నెరవేర్చలేని పరిస్థితిలో డీలర్స్‌‌ ఉన్నారు. మాన్యుఫాక్చరర్స్‌‌ దగ్గర స్టాక్స్‌‌ లేవు. డీలర్స్‌‌ దగ్గర ఉన్న స్టాక్‌‌ అంతంత మాత్రమేనని బెంగళూరులోని హోండా డీలర్‌‌ ఒకరు చెప్పారు. దసరా టైమ్‌‌‌‌లో అమ్మకాలు పెరగడమూ కారణమే.. పండగ సీజన్‌‌లో అమ్మకాలు ఎక్కువవడంతో, ఆ తర్వాత డీలర్స్‌‌ దగ్గర ఇన్వెంటరీ పెద్దగా లేదు. చాలా మంది మాన్యుఫాక్చరర్లు ప్రొడక్షన్‌‌లో ఇంకా తమ పీక్‌‌ కెపాసిటీలను అందుకోలేదు. అంతేకాకుండా, చాలా మంది ఒరిజినల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌ (ఓఈఎం) మెయింట్‌‌నెన్స్‌‌ షట్‌‌డౌన్‌‌లో ఉన్నారు. ఫెస్టివల్‌‌ సీజన్‌‌ తర్వాత ఇన్వెంటరీ కరెక్షన్‌‌లో భాగంగా ఈ మెయింట్‌‌నెన్స్‌‌ను వారు చేపట్టినట్లు చెబుతున్నారు. ఫెస్టివల్‌‌ సీజన్‌‌ తర్వాత కొంత ఇన్వెంటరీ పేరుకున్నా, గతంలో అంత ఎక్కువగా లేదని, దానికి తోడు సప్లయ్‌‌లో సమస్యలున్నాయని  సంఘి చెప్పారు. మార్కెట్లో ఎక్కువ డిమాండ్‌‌ ఉండే కంపాక్ట్‌‌ ఎస్‌‌యూవీలు, సెడాన్స్‌‌, హ్యాచ్‌‌బ్యాక్‌‌ల సెగ్మెంట్స్‌‌లో ఇన్వెంటరీలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. డిసెంబర్‌‌ నెలలో ఇన్వెంటరీలు సాధారణంగా 4 నుంచి 6 వారాలకు సరిపోయేలా ఉంటాయని డీలర్‌‌ వర్గాలు చెబుతున్నాయి. స్లోడౌన్‌‌తో డిసెంబర్‌‌ 2019లో స్టాక్‌‌ కరెక్షన్‌‌ జరిగిందని, అయినా కూడా ఆ ఏడాది 25 నుంచి 30 రోజుల ఇన్వెంటరీలు డీలర్స్ దగ్గర ఉన్నాయని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇన్వెంటరీస్‌‌ను చూస్తే అవి మూడు వారాలకు సరిపోయేలా మాత్రమే ఉన్నాయని చెబుతున్నాయి.