సోషల్ మీడియాకు ఆధార్ లింక్ చేసే ప్రతిపాదన లేదు

సోషల్ మీడియాకు ఆధార్ లింక్ చేసే ప్రతిపాదన లేదు

మూడోరోజు పార్లమెంట్ ప్రశాంతంగా నడిచింది. సోషల్ మీడియాలో నిఘాపై ఆఫ్ లైన్ లో కీలక ప్రకటన చేసింది కేంద్రం. చిట్ పండ్స్ చట్ట సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. సోనియా కుటుంబానికి SPG భద్రత తొలగించడంలో రాజకీయం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

దేశ పౌరుల సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ తో లింక్ చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ రవిశంకర్ ప్రసార్ లోక్ సభలో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వాట్సాప్ లో స్పైవేర్ ఇష్యూను తాము సీరియస్ గా డీల్ చేస్తున్నట్టు తెలిపారు. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత కోసం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. ఇజ్రాయెల్ కు చెందిన NSO కంపెనీ పెగాసస్ స్పైవేర్ ను రూపొందించిందన్నారు. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా 1400 ఫోన్ నెంబర్లు అఫెక్ట్ కాగా… అందులో 121 నెంబర్లు మాత్రమే ఇండియాకు చెందినవన్నారు. వాట్సాప్ నుంచి వివరణ కూడా తీసుకున్నామని తెలిపారు. ఇక వాట్సాప్ లో నిఘాకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా సమావేశమై చర్చించింది. ఈ కమిటీకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఛైర్మన్ గా ఉన్నారు.