రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. అమలు తర్వాత రెండో హయ్యెస్ట్

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. అమలు తర్వాత రెండో హయ్యెస్ట్

అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) వసూలు నమోదైంది. గత నెలలో రూ.1,30,127 కోట్ల పన్ను వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2017లో జీఎస్టీ అమలులోకి తెచ్చిన తర్వాత ఇది సెకండ్ హయ్యెస్ట్ అమౌంట్. అలాగే గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీతో పోలిస్తే ఈ సారి 24 శాతం అధికంగా వసూలైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది. 2019 అక్టోబర్‌‌తో పోలిస్తే 36 శాతం ఎక్కువని పేర్కొంది. కరోనా తర్వాత ఎకానమీ ఏ స్థాయిలో రికవరీ అవుతోందో చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. కార్లు, ఆటో మొబైల్స్ సేల్స్, సెమీకండక్టర్ డివైజెస్‌ సప్లై మెరుగుపడితే జీఎస్టీ రెవెన్యూ మరింత పెరిగేదని తెలిపింది.

వరుసగా గడిచిన నాలుగు నెలలుగా లక్ష కోట్లకు మించి జీఎస్టీ వసూలవుతూ వస్తోంది. ఇక సెప్టెంబర్‌‌లో జీఎస్టీ రూ.1.17 లక్షల కోట్లు వసూలైంది. అక్టోబర్‌‌లో దాదాపు 13 వేల కోట్లు ఎక్కువగా పన్ను వసూలైంది. అక్టోబర్‌‌లో వసూలైన మొత్తం జీఎస్టీలో రూ.23,861 కోట్లు సీజీఎస్టీ కాగా, రూ.30,421 కోట్లు ఎస్‌జీఎస్టీ ఉంది. ఇక రూ.67,361 కోట్లు ఐజీఎస్టీ వసూలైంది. అలాగే రూ.8,484 కోట్ల సెస్ కలెక్ట్ అయిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఐజీఎస్టీ నుంచి రూ.27,310 కోట్లను సీజీఎస్టీకి, రూ.22,394 కోట్లను ఎస్‌జీఎస్టీకి సెటిల్ చేసినట్లు వెల్లడించింది.  దీంతో సెంట్రల్ జీఎస్టీ రూ.51,171 కోట్లకు, స్టేట్ జీఎస్టీ రూ.52,815 కోట్లకు చేరింది.

మరిన్ని వార్తల కోసం..

పెట్రోల్ ధరలపై మహేష్ బాబు ఫొటోతో సజ్జనార్ ట్వీట్

ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

తుపాకీతో బెదిరించి యువతిని రేప్ చేసిన స్నేహితుడు